130 కోట్లు దాటిన జై లవకుశ కలెక్షన్లు (పూర్తి వివరాలు)

ఓవర్సీస్ లో ఎన్టీఆర్ మార్కెట్ ఇంతకుముందు కన్నా జై లవకుశ సినిమాతో మరింత పెరిగింది. ప్రీమియర్స్ తోనే జనతా గ్యారేజ్ రికార్డ్ బ్రేక్ చేసిన ఎన్టీఆర్ జై లవ కుశతో దుమ్ముదులిపేశాడు. యూఎస్ బాక్సాఫీస్ పై ఎన్.టి.ఆర్ దండయాత్ర అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. ఇక ఈ సినిమా కచ్చితంగా ఎన్.టి.ఆర్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తుందని తెలుస్తూనే ఉంది. రిలీజ్ నాడే 50 కోట్ల గ్రాస్ తో కలక్షన్స్ ప్రభంజనం సృష్టించిన ఎన్.టి.ఆర్ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ 132 కోట్లు దాటింది. యూఎస్ లో 2 మిలియన్ డాలర్లకి అతి చేరువగా వచ్చింది. అమెరికాలో బుధవారం వరకు జై లవకుశ సినిమా 15 లక్షల 02వేల 027 డాలర్లను కలెక్ట్ చేసింది. అమెరికాలో బుధవారం ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా విడుదల అయింది. బుధవారం నుంచి బుధవారం వరకు అమెరికాలో జై లవకుశ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

బుధవారం ప్రీమియర్లు+ గురువారం కలెక్షన్లు=== 7 లక్షల 44వేల 130 డాలర్లు
శుక్రవారం కలెక్షన్లు==== 2 లక్షల 64వేల 952 డాలర్లు
శనివారం కలెక్షన్లు===== 2 లక్షల 83వేల 593 డాలర్లు
ఆదివారం కలెక్షన్లు===== 1,01,935 డాలర్లు
సోమవారం కలెక్షన్లు===== 16వేల 388 డాలర్లు
మంగళవారం కలెక్షన్లు===== 38వేల 025 డాలర్లు
బుధవారం కలెక్షన్లు ===== 49వేల 078 డాలర్లు
మొత్తం==== 15 లక్షల 02 వేల 027 డాలర్లు (9.89 కోట్ల రూపాయలు.)

అమెరికాలో రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా జై లవకుశ సినిమా ఇప్పటివరకు 132 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. బాహుబలి-2 తర్వాత ఈ యేడాది ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నింటిలోనూ రెండవ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా జై లవకుశ నిలిచిందంటున్నారు. విడుదలయిన మొదటి వారంలోనే 132 కోట్ల రూపాయల కలెక్ష్లను కొల్లగొట్టి రికార్డులను తిరగరాస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. లాంగ్‌రన్‌లో ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే అవకాశముందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

More from my site

Comments

comments