2.0 టీజర్ ఫెంటాస్టిక్‌.. మైండ్ బ్లోయింగ్‌.. రిబ్ టికిలింగ్‌.. వండ‌ర్ ఫుల్ ..సరిపోవు (వీడియో)

నిమిషం పాటు మేకింగ్ టీజ‌ర్‌లోనే ద‌డ పుట్టించాడు శంక‌ర్‌. ఇక పూర్తి స్థాయి ట్రైల‌ర్ వ‌దిలితే ఇంకేమైనా ఉందా? వ‌్వావ్ వ్వావ్ అని కేక‌లు పెట్టేలా ఉంది. ర‌జ‌నీకాంత్ ఫ్యాన్స్‌కి, శంక‌ర్ ఫ్యాన్స్‌కి వెల్ ట్రీట్ ఇది. శంక‌ర్ సినిమా స్థాయిని మ‌రో లెవ‌ల్‌కి తీసుకెళ్లే సినిమా వ‌స్తోంద‌న‌డానికి ఇదిగో ఈ మేకింగ్ టీజ‌ర్‌నే ఎగ్జాంపుల్‌.

నిన్న‌ శంక‌ర్ ట్విట్ట‌ర్‌లో స్వ‌యంగా ఓ మాట చెప్పాడు. శుక్ర‌వారం సాయంత్రం 6 pm 2.0 (రోబో2) టీజ‌ర్‌ని లాంచ్ చేస్తున్నాన‌ని, ఫ్యాన్స్‌కి వినాయ‌క‌చ‌వితి కానుక ఇస్తున్నాన‌ని ప్ర‌క‌టించాడు. ఆ ప్ర‌కార‌మే టీజ‌ర్ లాంచ్ చేశాడు. ముఖ్యంగా ఈ టీజ‌ర్‌లో పూర్తిగా అత‌డి ఫోక‌స్ అంతా క్యారెక్ట‌ర్ల డిజైన్‌పైనా, మేక‌ప్‌పైనా ఫోక‌స్ చేశాడు. ఇక భారీ ఎక్స్‌ప్లోజివ్స్‌.. క్యారెక్ట‌ర్ మూవ్‌మెంట్‌ని ఆడియెన్‌కి అర్థ‌మ‌య్యేలా చూపించాడు. ఇక రోబో పాత్ర రూప‌క‌ల్ప‌న‌, బ్యాడీగా అక్ష‌య్ మేక‌ప్‌ని ఎలివేట్ చేసే రోబోటిక్ మాస్క్‌ల త‌యారీని విజువ‌ల్స్‌లో చూపించాడు. గ్రీన్‌మ్యాట్ పార్మాట్‌లో భారీ యాక్ష‌న్ సీన్ల‌ను ఎలివేట్ చేసిన వైనం ఈ విజువ‌ల్స్ లో క‌నిపించింది. ఇక‌పోతే య‌థావిధిగా శంక‌ర్ శైలిలో కార్ ఛేజ్‌లు, జంపింగ్ సీన్ల‌కు .. క‌ళ్లు మిరుమిట్లు గొలిపే సీన్ల‌కు కొద‌వే ఉండ‌ద‌ని చెప్పే సీన్లు మేకంగ్ సాక్షిగా చూపించాడు. మొత్తానికి 2018లో సూప‌ర్‌స్టార్ అభిమానుల‌కు అదిరిపోయే ట్రీట్ ఉంద‌ని ఈ మేకింగ్ వీడియో చెబుతోంది. ర‌జ‌నీ రోబోటిక్ విన్యాసాలు, అక్ష‌య్ ధీటైన య‌క్ష‌న్ క‌న్నుల‌పండువగా ఉంటుంది. ఇక ఎమీజాక్స‌న్ నిండైన అందాలు ఫ్యాన్స్‌కి కిర్రెక్కించ‌డం ఖాయం. ఒకే ఒక్క టీజ‌ర్‌తో ద‌డ పుట్టించావు గురూ!

More from my site

Comments

comments