అక్కడ డిజె భారీ లాస్.. బన్నికి అదిరిపోయే షాక్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాధం తెలుగు రాష్ట్రాల్లో ఓకే కాని ఓవర్ సీస్ లో మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద షాక్ ఇచ్చిందని తెలుస్తుంది. జూన్ 23న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్స్ తొలి వారాంతరం లో హాఫ్ మిలియన్ వసూళ్లను రాబట్టగా మిగిలిన హాఫ్ మిలియన్ అంటే సినిమా 1 మిలియన్ కలెక్ట్ చేయడానికి వన్ వీక్ పట్టింది. ఇక రెండు వారల్లో ఓవర్ సీస్ లో కేవలం 1.1 మిలియన్ డాలర్స్ మాత్రమే వసూళు చేసిందట.

ఈ లెక్కన అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కు డిజె షాక్ తగలక తప్పట్లేదనిపిస్తుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడని అల్లు అర్జున్ డిజెని 9 కోట్ల భారీ మొత్తంతో ఓవర్సీస్ రైట్స్ కొన్నారట. కాని ఇప్పుడు పరిస్థితి చూస్తే ఫుల్ రన్ లోనే 5, 6 కోట్లు తప్ప మిగిలేవి వచ్చేలా కనబడట్లేదు. అంతేకాదు వచ్చిన వసూళ్లలో సగం ప్రమోషన్స్ ఖర్చులకు, సగం ట్యాక్సు లకు పెట్టాల్సి వస్తుందట.

హరిష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన దువ్వాడ జగన్నాధం రొటీన్ కథ కథనాలతోనే వచ్చింది. తెలుగు రెండు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు రాబడుతున్నా ఓవర్సీస్ లో మాత్రం డిజె ఫ్లాప్ అనేస్తున్నారు. అక్కడ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు డిజె ఏమాత్రం నచ్చలేదని అర్ధమవుతుంది. ఓవర్సీస్ లో కలక్షన్స్ పెంచేందుకు డిజె టీం అంతా ఫారిన్ ట్రిప్పులేస్తున్నా సరే ప్రయోజనం మాత్రం ఏం లేదని తెలుస్తుంది.

More from my site

Comments

comments