అల్లు వారి శాటిలైట్ ఆకాశమంత

రచయిత వక్కంత వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా నా పేరు సూర్య … నా ఇల్లు ఇండియా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నిర్విఘ్నంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అల్ రెడీ అమ్ముడు పోయినట్లు సమాచారం. ఈ శాటిలైట్ రైట్స్ రూపంలో సినిమాకి జీ తెలుగు 10 కోట్లు చెల్లించేందుకు ముందుకి వచ్చినట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మొదటి సారి ARMY ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇందులో విలన్ గా శరత్ కుమార్, హీరోయిన్ గా అనూ ఇమాన్యూయేల్ నటిస్తుంది. అయితే ఇంత భారీ మొత్తంలో శాటిలైట్ రైట్స్ ఇంకా షూటింగ్ లో ఉండగానే వెళ్ళడం అంటే అది అల్లు అర్జున్ మార్కెట్ స్టామినా అని ఇప్పుడు మెగా అభిమానులు చెప్పుకుంటున్నారు. అయితే మరి ఈ సినిమా ఎ రేంజ్ హిట్ అవుతుందో అనేది చూడాలి.

More from my site

Comments

comments