ఓరి దేవుడోయ్……ఆరడుగుల బుల్లెట్ పరువు తీసేశాడుగా….(ట్రైలర్ రివ్యూ)

గోపీచంద్-బి. గోపాల్ కాంబినేషన్‌లో ఏళ్ళ క్రితం నుంచీ ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ బి. గోపాల్‌ ఇఫ్పుడు ఫాంలో లేడు కానీ ఒకప్పటి ఇండస్ట్రీ హిట్స్ సమరసింహారెడ్డి, ఇంద్ర సినిమాల డైరెక్టర్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా వేరే డైరెక్టర్‌తో ఎప్పుడో స్టార్ట్ చేశారు. అయితే ఆ డైరెక్టర్‌తో ఏం తేడాలు వచ్చాయో కానీ అతన్ని తీసేసి….ఖాళీగా ఉన్న బి.గోపాల్‌ని సీన్‌లోకి తెచ్చారు. ఆ తర్వాత కూడా ఆగుతూ……మళ్ళీ మొదలవుతూ మొత్తానికి ఇన్నాళ్ళకు ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. మామూలుగా అయితే ఈ సినిమాని ఎవరూ పట్టించుకుని ఉండేవాళ్ళు కాదు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో సూపర్ హిట్ అయిన సాంగ్ నుంచి ఆరడుగుల బుల్లెట్ అనే సూపర్ పాపులర్ వర్డ్స్‌ని టైటిల్‌గా పెట్టుకోవడంతో సినిమాకు కాస్త బజ్ వచ్చింది. సినిమా ఒకటి ఉందన్న విషయం జనాలకు తెలిసింది.

అయితే ఈ రోజు రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే మాత్రం ఆ ‘ఆరడుగుల బుల్లెట్’ అన్న టైటిల్ తప్ప ఇక సినిమాలో వేరే మేటర్ అంటూ ఏమీ ఉండే అవకాశం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికి ట్రైలర్‌లో అయితే మాత్రం పవర్ స్టార్ టైటిల్ మాత్రం ఇక వేరే మేటర్ ఏమీ లేదు. ఇక ట్రలర్ కూడా అంతా ఓల్డ్ స్టైల్‌లో ఉంది. ట్రైలర్‌లోనే కథ మొత్తం తెలిసిపోయేలా చేశారు.

హీరో బేవార్స్ కుర్రాడు. పనీ పాటా లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. మనవాడు బేవార్స్ కాబట్టి డీసెంట్ పర్సన్ అయిన ఆ అమ్మాయి ఫాదర్ నో అంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇంటికి…ఆ అమ్మాయి ఫాదర్‌కి ఒక సమస్య వచ్చింది. షరా మామూలుగా మన హీరోగారు ఎంటర్ అయిపోయి విలన్‌ని ఉతికి ఆరేసి హీరోయిన్‌తో పాటు, హీరోయిన్ ఫాదర్‌ని కూడా మెప్పించి……….కత్తిలాంటి నిఖార్సైన ఆరడుగుల బుల్లెట్ అని హీరోని క్లైమాక్స్ వరకూ తిట్టిన అందరి చేతా అనిపించుకుంటాడు…….అదీ కథ. ఇక ఈ ట్రైలర్‌లో వచ్చేన సీన్స్, షాట్స్, మేకింగ్ స్టైల్, కిక్ సినిమాలో ఏ ఎదవనైనా చేసుకుంటా అని హీరోయిన్ అనగానే రవితేజ బ్రహ్మానందాన్ని చూపించడంలాంటి ఎపిసోడ్‌ని యాజ్ ఇట్ ఈజ్‌గా ఎత్తేసిన విధానం చూస్తూ ఉంటేనే ఇది పాతగా ఉండడంతో పాటు రోతగా ఉండడం కూడా ఖాయం అనిపిస్తోంది. ప్రస్తుతానికి ట్రైలర్ అయితే అలానే ఉంది. టైటిల్‌తో పవన్ ఇమేజ్‌ని క్యాష్ చేసుకోవాలనుకోవడం బాగానే ఉంది కానీ మరీ విషయం లేకపోతే పవన్ ఇమేజ్ మాత్రం ఏం చేస్తుంది?

Comments

comments