టాప్ 10 జాబితాలో చేరిన అర్జున్ రెడ్డి

అర్జున్ రెడ్డి సినిమా చాలా చాలా చాలా చాలా బాగుంది. కామెడీ ట్రాక్స్ కోసమో, హీరోయిన్ అంగాంగ ప్రదర్శనల కోసమో, ఫైట్స్ కోసమో కాకుండా ఒక రియల్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే మాత్రం కచ్చితంగా ఈ సినిమాను ఎన్ని సార్లైనా చూడవచ్చు. అందుకే విడుదలై రెండు వారాలు దాటినా ‘అర్జున్ రెడ్డి’ జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా జోరుకు బ్రేకుల్లేవు. దీంతో పాటుగా రెండు సినిమాలు రిలీజైనా.. తర్వాతి రెండు వారాల్లో మూడు సినిమాలొచ్చినా.. అవేవీ ‘అర్జున్ రెడ్డి’ని ఆపలేకపోయాయి. 1.5 మిలియన్ మార్కును దాటి యుఎస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 జాబితాలో పెద్ద సినిమాల జాబితాలో చేరిపోయింది ‘అర్జున్ రెడ్డి.  ‘అర్జున్ రెడ్డి’ సినిమా పదో స్థానానికి చేరుకోవడం విశేషం. నందమూరి బాలకృష్ణ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకొంది ‘అర్జున్ రెడ్డి’. ప్రస్తుతానికి ఈ చిత్ర వసూళ్లు 1.682 డాలర్లకు చేరుకున్నాయి.

‘బాహుబలి: ది కంక్లూజన్’ 20.57 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత వరుసగా ‘బాహుబలి: ది బిగినింగ్’ (6.99 మిలియన్లు).. శ్రీమంతుడు (2.89).. అఆ (2.449).. ఖైదీ నెంబర్ 150 (2.447).. ఫిదా (2.058).. నాన్నకు ప్రేమతో (2.022).. అత్తారింటికి దారేది (1.897).. జనతా గ్యారే్ (1.8)  ఉన్నాయి. ఈ చిత్రం 2 మిలియన్ మార్కు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ.25 కోట్ల షేర్ మార్కును టచ్ చేసింది.

More from my site

Comments

comments