అర్జున్ రెడ్డి సినిమా బ్లడీ బోల్డ్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

విజయ్ దేవరకొండ సినిమా ‘అర్జున్ రెడ్డి’ సూపర్ హిట్ టాక్ తో నడుస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమా కేవలం ప్రేక్షకులను మాత్రమే కాక, స్టార్ హీరో హీరోయిన్లని సైతం అమితంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే మహేష్ బాబు, అనుష్క, సమంతా, రాజమౌళి లాంటి స్టార్లంతా సినిమాను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేయగా తాజాగా స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అర్జున్ రెడ్డి సినిమాను చూసి ఈ  సినిమాపై బోల్డ్ కామెంట్ చేశారు.

‘అర్జున్ రెడ్డి చూశాను. రా, రియలిస్టిక్, బ్లడీ బోల్డ్ గా ఉంది. విజయ్ దేవరకొండ, షాలిని, రాహుల్ రామకృష్ణ, సందీప్ వంగ, యూనిట్ మొత్తానికి హ్యాట్స్ ఆఫ్’ అంటూ తన పేస్ బుక్ పేజీ మీద పోస్ట్ పెట్టారు. ఇలా స్టార్లంతా ఎలాంటి ఈగో లేకుండా సినిమా బాగుందనడంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత ఎక్కువై కలెక్షన్లు ఇప్పటికీ మెరుగ్గానే సాగుతున్నాయి. ‘A’ సర్టిఫికెట్ పొందినప్పటికీ యూఎస్ లో సైతం సినిమా బ్రహ్మాండంగా ఆడుతూ ఇప్పటికే 2 మిలియన్ డాలర్స్ దిశగా పరిగెడుతోంది.

More from my site

Comments

comments