బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దారుణం

కోట్లాది మంది భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే  భక్తుల సెంటిమెంట్లను దెబ్బ తీసే ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలోని ఉపాలయంలో ఉన్న శ్రీవల్లి అమ్మవారి మంగళసూత్రాన్ని ఒక అర్చకుడు తాకట్టు పెట్టుకున్న విషయం బయటకు వచ్చింది. పెద్ద ఎత్తున షాకింగ్ గా మారిన ఈ ఉదంతంతో కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో ఇంత భారీ అపచారం జరగటాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామివారి ఉపాలయం ఉంది. ఇందులో శ్రీవల్లి అమ్మవారి విగ్రహానికి ఉన్న తాళిని తీసుకున్న అర్చకుడు గుట్టుచప్పుడు కాకుండా మాయం చేశారు.

ఆ అమ్మవారి మంగళసూత్రాన్ని తీసుకెళ్లి మార్వాడీ వద్ద తాకట్టు పెట్టాడు. ఆ విషయాన్ని ఆలయ అధికారులు గుర్తించి విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకొని హుటాహుటిన స్పందించి తాకట్టులో ఉన్న అమ్మవారి మంగళసూత్రాన్ని విడిపించారు. డబ్బుల కక్కుర్తితో ఇంత దారుణానికి పాల్పడిన బ్రాహ్మణుడిపై భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత అపచారానికి పాల్పడినందుకు కఠిన శిక్ష విధించాలన్న అభిప్రాయాన్ని పలువురు భక్తులు వ్యక్తం చేస్తున్నారు.

More from my site

Comments

comments