ఆ సినిమా ఆడియోకి పాతిక కోట్లు ఖర్చు.. ఇండస్ట్రీని వణికిస్తున్న న్యూస్..!

టైటిల్ చూసి ఆశ్చర్య పడొచ్చేమో కాని పాతిక కోట్లతో ఆడియో రిలీజ్ చేసి ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ సరికొత్త సంచలనాలు సృష్టించేలా చేస్తుంది ఓ సౌత్ సినిమా. అది ఏదో కాదు రోబో సీక్వల్ గా వస్తున్న 2.ఓ. శంకర్ డైరక్షన్ లో సూపర్ స్టార్ రజినికాంత్, ఎమీ జాక్సన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న 2.ఓలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ రోల్ లో నటిస్తుండటం విశేషం.

400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఆడియోని 25 కోట్ల ఖర్చు పెట్టి మరి దుబాయ్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అక్టోబర్ లో రిలీజ్ అవనున్న ఈ ఆడియోకి హాలీవుడ్ స్టార్ హీరోలను తీసుకొచ్చే పనిలో ఉన్నారట దర్శకుడు శంకర్. దుబాయ్ లో జరిగే ఈ ఆడియో వేడుకలో ఇంతవరకు ఏ ఆడియో జరుగని రీతిలో ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారట.

జనవరి 25, 2018న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో ఇండియన్ సినిమా రికార్డులన్ని తుడిచి వేయాలని చూస్తున్నారు శంకర్. హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా 2.ఓ తెరకెక్కుతుంది. ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా భారీగా చేస్తుండటం విశేషం.

More from my site

Comments

comments