బాహుబలి-2…సెన్సార్ డిటెయిల్స్, డ్యూరేషన్ డిటెయిల్స్, రిపొర్ట్!!

baahubali-2-movie

భారతదేశ సినిమా చరిత్రలోనే అత్యంత ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలబడుతుందని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్న బాహుబలి-2 సినిమా సెన్సార్ నిన్న రాత్రి పూర్తయింది. అత్యంత పకడ్బంధీ ఏర్పాట్ల మధ్య సెన్సార్ చేయించాడు రాజమౌళి. మరీ ముఖ్యంగా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే సీక్రేట్ బయటకు పోకూడదన్న విషయం సెన్సార్ సభ్యులకు సీరియస్‌గా చెప్పాడట జక్కన్న. అవసరమైతే లీగల్‌గా చర్యలు తీసుకోవడానికి కూడా రెడీ అని చెప్పి సెన్సార్ మెంబర్స్‌తో చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే ఎన్నో జాగ్రత్తల మధ్య రాత్రిపూట సెన్సార్ సభ్యులకు బాహుబలి-2 సినిమాను స్క్రీనింగ్ చేయడం జరిగింది.

సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యూఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఎలాంటి కట్స్ కూడా చెప్పలేదని తెలుస్తోంది. ముందుగానే సెన్సార్ దగ్గర ఎలాంటి ఇష్యూస్ రాకుండా అందుకు తగ్గ జాగ్రత్తలు రాజమౌళి తీసుకున్నాడట. తనకు తెలిసిన సీనియర్ సెన్సార్ మెంబర్‌కి కీరవాణి స్టూడియో స్పెషల్ షో వేసి మరీ ఏఏ సీన్స్‌తో సమస్య వచ్చే అవకాశం ఉందో ఆ సీన్స్ అన్నింటి విషయంలో సెన్సార్‌కి తగ్గట్టుగా మార్పులు చేశాడట. అందుకే ఒకే ఒక్క షోతోనే సెన్సార్ అయిపోయింది. ఎలాంటి కట్స్ లేకుండా యుఎ సర్టిఫికెట్ వచ్చేసింది. ఇక బాహుబలి-2 మొత్తం డ్యురేషన్ 167నిమిషాలు. ఫస్ట్ పార్ట్‌ని కొంచెం అటూ ఇటూగా రెండు గంటలకే పరిమితం చేసిన రాజమౌళి…..సెకండ్ పార్ట్ విషయంలో మాత్రం డ్యూరేషన్ ఎక్కువైనా కూడా కథను పూర్తిగా చెప్పడానికే ఆసక్తి చూపించాడట. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఇష్యూకి సంబంధించిన సీన్సే దాదాపు పది పదిహేను ఉంటాయని తెలుస్తోంది. ఇక సెకండ్ హాఫ్‌లో రానా-ప్రభాస్‌ల యుద్ధానికి ముందు వచ్చే ఎపిసోడ్, వార్ ఎపిసోడ్ అంతా కూడా చాలా ఎక్కువ డ్యూరేషనే ఉంటుందట. సో….ఈ సారి బాహుబలి-2 సినిమాతో మాత్రం బాహుబలిలో కథ కాస్త తక్కువైందని ఫీలయిన ప్రేక్షకులందరినీ కూడా కథ, ఎమోషన్స్‌తోనే కట్టిపడేయనున్నాడు జక్కన్న. వెయ్యి కోట్ల కలెక్షన్స్ టార్గెట్‌తో వస్తున్న బాహుబలి-2 ఏ స్థాయి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

Comments

comments