పవన్ అభిమానులు పడ్డారా? లేదా?

పబ్లిసిటీ….ఎలా చేయాలి? ఏం మాట్లాడాలి? ఎలాంటి మాటలు చెప్తే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రచార కార్యక్రమాల్లో ఎంత డ్రామా ఉండాలి? ఆ డ్రామా ఎంత గొప్పగా ఉండాలి? లేకపోతే కామెడీతో పని కానిచ్చేద్దామా? అప్పుడు కూడా పనవ్వదనుకుంటే షాకింగ్ విషయాలు ఏవైనా చెప్పి అందరి చూపూ మనవైపు తిప్పుకుందామా…….ఇలాంటి ప్రచార జిమ్మిక్స్ విషయంలో మన సినిమా వాళ్ళు మహా ముదుర్లు. అందుకే చంద్రబాబునాయుడిలాంటి నేతలు కూడా రాఘవేంద్రరావు, పరుచూరి బ్రదర్స్‌లాంటి వాళ్ళపైన ఆధారపడుతూ ఉంటారు.

ఇక తాజాగా రిలీజ్ అయినే బాహుబలి-2 విషయంలో అలాంటి సూపర్ జిమ్మిక్ ఒకటి ప్లే చేశాడు ఆ సినిమా రచయిత విజయేంద్రప్రసాద్. భారీ బడ్జెట్ సినిమా….ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ కొల్లగొడుతున్నప్పటికీ తెలుగునాట మాత్రం ఎందుకనో పవన్ ఫ్యాన్స్ కొంతమంది సినిమాను చూడొద్దంటూ ప్రచారం చేశారు. భీమవరంలో ప్రభాస్-పవన్ ఫ్యాన్స్ గొడవలే అందుకు ప్రధాన కారణం అయి ఉండొచ్చని విశ్లేషకుల ఆలోచన. కలెక్షన్స్ విషయంలో ఒక్క రూపాయి కూడా మిస్సవ్వకూడదు. పూర్తిగా క్యాష్ చేసుకోవాలి అనే ఆలోచన రాజమౌళిది. అందుకే పవన్ ఫ్యాన్స్‌కి ఓ బంపర్ బిస్కెట్ వదిలారు విజయేంద్రప్రసాద్. బాహుబలి-2 ఇంటర్వెల్ సీన్ ఐడియా పవన్ ఫ్యాన్స్ హంగామా చూసినప్పుడే వచ్చిందని చెప్పాడు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే కంప్లీట్‌గా విజయేంద్రప్రసాద్ మాటలనే వినిపించింది కానీ సోషల్ మీడియాలో మాత్రం విజయేంద్రప్రసాద్ మాట్లాడిన నిమిషాల వ్యవధిలోనే అసలు విషయాన్ని చెప్పేసింది. సినిమాకు దూరంగా ఉన్న పవన్ ఫ్యాన్స్‌ని మెప్పించడం కోసమే ఈ మాటలన్నీ అని చెప్పి పవన్ ఫ్యాన్సే సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు.

విజయేంద్ర ప్రసాద్ మాట్లాడిన తర్వాత అయినా పవన్ ఫ్యాన్స్ కూల్ అయ్యారా? సినిమాను రిసీవ్ చేసుకున్నారా అంటే మాత్రం బాహుబలి-2కి వచ్చిన ఉత్తరాంధ్ర కలెక్షన్స్ చూస్తుంటే ఎక్కువ మంది సినిమాను చూసినట్టుగానే కనిపిస్తోంది. కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ విషయం పక్కన పెడితే మిగతా అందరూ చూశారని……అందుకే ఉత్తరాంధ్రలో బాహుబలి సినిమా రికార్డ్‌ని బీట్ చేసిన ఖైదీ నెంబర్ 150 రికార్డ్‌ని బాహుబలి-2 బ్రేక్ చేయగలిగిిందని చెప్తున్నారు. మొత్తానికి విజయేంద్రప్రసాద్ మాటల మంత్రం పనిచేసినట్టుగానే భావించాలన్నమాట.

More from my site

Comments

comments