సముద్రాలు దాటిన బాహుబలి ప్రభంజనం… 50 మిలియన్ల మార్కుకి దగ్గరగా..

ఒక్క ఉత్తర అమెరికాలో మాత్రమే ‘బాహుబలి-2’ 19 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయడం విశేషం. తర్వాతి వీకెండ్ అయ్యేసరికి ఈజీగా 20 మిలియన్ డాలర్ల మార్కును అందుకుని సంచలనం సృష్టించడం ఖాయం. ఇక యూఏఈ, ఖతార్ లాంటి మిడిల్ ఈస్ట్ దేశాలన్నింట్లో కలిపి ‘బాహుబలి-2’ 8.75 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. మామూలుగా ఖాన్స్ నటించే హిందీ సినిమాలు మాత్రమే ఇక్కడ ఈ స్థాయిలో వసూళ్లు రాబడుతుంటాయి.

మరోవైపు ఆసియా దేశాలన్నింట్లో కలిపి 6 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసిన బాహుబలి-2.. ఐరోపాలో 4 మిలియన్ డాలర్ల మార్కుకు చేరువవుతోంది. ఆఫ్రికాలో సైతం 3.5 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసిన ఈ సినిమా.. ఓవరాల్‌గా 40 మిలియన్ మార్కును దాటేసింది. ఫుల్ రన్లో ఈ చిత్రం విదేశాల్లో 50 మిలియన్ మార్కును టచ్ చేసే అవకాశముంది.

More from my site

Comments

comments