బాహుబలి మాకు నచ్చలేదు.. మా కారణాలు మాకున్నాయి!!

సోది సుత్తి లేకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్ఛేస్తున్నాం :
కారణం 1) మాకు ఫ్యాన్స్ వార్ లంటే భలే కిక్కు.. మాకు మధ్య వార్ లు నడిచేదే కలెక్షన్ల మీద..బాహుబలి తో ఇక నుండి అవి బంద్. మా టైం పాస్ కు అడ్డుకట్ట వేసిన బాహుబలి మాకు నచ్చలేదు.

కారణం 2) ఆ రికార్డులు ఈ రికార్డులంటూ అన్ని రికార్డులని మా హీరోల పేరు మీద ఉన్న చిన్నా చితకా రికార్డులని కూడా వదలటం లేదు. టౌన్ , సిటీ , ఆఖరుకు మా పల్లెల్ని కూడా వదలకుండా అన్నింట్లో నెంబర్ వన్. అందుకే మాకు నచ్చటం లేదు.

కారణం 3) ఏ సినిమా అయినా సరే బాగుందా? బాగాలేదా ? అని అడుగుతారు… కానీ ఈ సినిమాని మాత్రం చూశావా ? చూస్తే ఎన్ని సార్లు చూశావు ? లేకుంటే ఎప్పుడు చూస్తావు ? అని అడుగుతున్నారు… బాగాలేదని చెప్పటానికి కూడా మాకు ధైర్యం చాలటం లేదు. అందుకే మాకు నచ్చలేదు.

కారణం 4) అన్నన్ని డబ్బులు పెట్టుకొని సినిమా చూస్తే కనీసం హీరోయిన్ చేత చిన్న ఎక్స్ పోజింగ్ కూడా చేయించలేదు. అందుకే మాకు నచ్చలేదు.

కారణం 5) చిన్నా చితకా ముసలి ముతకా మా హీరో సినిమాలు చూడటానికే బయటకి వస్తారు అని మొన్నటివరకు డబ్బాలు కొట్టేవాళ్ళం.. కానీ ఇప్పుడు షో టైమ్ ఎర్లీ మార్నింగ్ అయినా.. లేట్ నైట్ షో అయినా సరే ఎగబడి వచ్చేస్తున్నారు.. అందుకే మాకు నచ్చలేదు.

కారణం 6) ఇన్ని రికార్డులని మా హీరో ఎప్పటికి కొట్టేనో.. మళ్ళీ మేము కాలర్ ఎగరేసుకొని ఎప్పుడు తిరగాలో.. అందుకే మాకు నచ్చలేదు.

ఏది ఏమైనా సరే.. రజిని కాంత్ మెచ్చటం మాకు నచ్చలేదు… రోబో దర్శకుడు శంకర్ ట్వీట్ చెయ్యడం మాకు నచ్చలేదు…. చిరంజీవి ప్రశంసించడం మాకు నచ్చలేదు… ఎన్టీఆర్, మహేష్ బాబుల మెచ్చుకోళ్లు మాకు నచ్చలేదు. ఇంకా చెప్పుకుంటూ పొతే బోలెడు కారణాలు… మా కారణాలు మాకున్నాయి.

More from my site

Comments

comments