బాహుబలి-2 డే 1 ఫుల్ కలెక్షన్స్ డిటెయిల్స్ ఇన్ ఆల్ ఏరియాస్, స్టేట్స్, నేషన్స్

భారతదేశంలో ఉన్న ప్రేక్షకులతో పాటు ప్రపంచ దేశాల్లో ఉన్న బాహుబలి లవర్స్ అందరూ ఎదురుచూసిన బాహుబలి-2 సినిమా సునామీలా థియేటర్స్‌లోకి దూసుకొచ్చింది. కలెక్షన్స్ తుఫాన్ అనేలాంటి పదాలు కూడా చిన్నబోయేలా…….బాలీవుడ్ బిగ్గెస్ట్ గ్రాసర్స్ సినిమాలకు, బాలీవుడ్ టాప్ స్టార్స్ ఖాన్స్‌కి బొమ్మకనపడేలా దేశంలోనే నంబర్ స్థానాన్ని పదేళ్ళపాటు తనపేరుపైనే నిలుపుకునే స్థాయి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది.

కేవలం ఇండియాలో రిలీజ్ అయిన థియేటర్స్‌లోనే మొదటి రోజే 100 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిన ఒకే ఒక్క సినిమా బాహుబలి-2.

కలెక్షన్స్ః

ఆల్ ఇండియా(హిందీ)ః 35-40 క్రోర్స్

ఆంధ్రా-తెలంగాణాః 45 క్రోర్స్

తమిళనాడుః 14 కోట్లు

కర్ణాటకః 10 కోట్లు

కేరళః 4 కోట్లు

డే 1 ఇండియాః 108-120 క్రోర్స్

నాన్ హాలిడే రోజు ఇండియాలో రిలీజ్ అయిన అన్ని సినిమాలకంటే బాహుబలి-2నే ఎక్కువ కలెక్షన్స సాధించింది. ఇంతకుముందు ధూమ్-3కి ఉన్న రికార్డ్‌ని బ్రేక్ చేసింది

బాహుబలి సినిమాని బాహుబలి-2 డబుల్ మార్జిన్‌తో బీట్ చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇండియాలోనే మొదటిరోజే ఓ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేయడం ఇదే మొదటిసారి.

అమెరికాలో గురువారం ప్రివ్యూస్‌తోనే 2.5 మిలియన్ డాలర్స్ సాధించిన బాహుబలి హాలీవుడ్ మూవీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-8 కలెక్షన్స్‌ని బీట్ చేసి నంబర్ ఒన్ పొజిషన్ దక్కించుకుంది.

బాహుబలి-2 హిందీ వెర్షన్ మొదటి మూడు రోజుల అడ్వాన్స్ బుకింగ్స్‌తో 30 కోట్లు సాధించి…సల్మాన్ ఖాన్‌ని సుల్తాన్‌ని బీట్ చేసి నంబర్ ఒన్ పొజిషన్‌లో నిలబడింది

మన తెలుగు వాడు జక్కన్న, ప్రభాస్‌లు సాధించిన కలెక్షన్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో చూశారా? బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఆఫీస్ విషయంలో భారతదేశంలో ఉన్న సినిమా పరిశ్రమలన్నింటికీ తెలుగోడి సత్తా ఏంటో చూపించాడు జక్కన్న. ప్రపంచదేశాలలోె కూడా తెలుగు సినిమాకు గుర్తింపు తెచ్చాడు. తెలుగు సినీ పరిశ్రమను కనీసం గుర్తించడానికి ఇష్టపడని వాళ్ళకు మాత్రం గట్టిగా సమాధానం చెప్పాడు జక్కన్న. అందుకే సాహో రాజమౌళి……భళిరా ప్రభాస్ అని తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా జక్కన్న, ప్రభాస్‌లను వేనోళ్ళ ప్రశంసిస్తోంది. ఇక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా సినిమా లవర్స్ నుంచి బాహుబలి మేకర్స్‌కి అద్భుతమైన ప్రశంశలు దక్కుతున్నాయి.

More from my site

Comments

comments