అత్యంత ఎక్కువ గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా బాహుబలి-2

రాజమౌళి కష్టం ఫలించింది. అది కూడా కష్టానికి వంద రెట్ల స్థాయిలో ఫలితం కనిపిస్తోంది. ఇండియాలో ఉన్న ట్రేడ్ పండిట్స్ ఎవ్వరూ ఊహించని స్థాయిలో కేవలం నాలుగు రోజుల్లోనే అత్యంత ఎక్కువ కలెక్షన్స్ సాధించిన బిగ్గెస్ట్ సినిమాగా బాహుబలి-2 నిలిచింది. దాదాపుగా 600 కోట్ల కలెక్షన్స్ సాధించింది.

ఓవర్సీస్ కలెక్షన్స్ లెక్కల విషయం పక్కన పెడితే కేవలం నాలుగు రోజుల్లో ఇండియాలో అత్యంత ఎక్కువ గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా బాహుబలి-2 నిలిచింది. బాహుబలి1, దంగల్, సుల్తాన్‌లాంటి సినిమాలు సాధించిన పూర్తి కలెక్షన్స్‌కి బాహుబలి-2 కేవలం నాలుగు రోజుల్లో బీట్ చేసింది. ఐదు రోజుల్లో బాహుబలి-2 నెట్ షేర్ 425 కోట్లు ఉంటుందని, ఇప్పటి వరకూ రిలీజ్ అయిన అన్ని సినిమాల్లోకి హైయ్యెస్ట్ కలెక్షన్ మార్క్ అదేనని ట్రేడ్ పండిట్స్ చెప్తున్నారు. మొత్తానికి బాహుబలి యూనిట్ టార్గెట్ పెట్టకున్న వెయ్యి కోట్ల కలెక్షన్స్ మార్క్‌ని అయితే కచ్చితంగా టచ్ చేసేలానే ఉంది బాహుబలి-2. అలాగే ఈ సినిమా ఇప్పటి వరకూ ఓవర్సీస్‌లో 12 మిలియన్ కలెక్షన్స్ సాధించింది.

More from my site

Comments

comments