పూరి మార్క్ తో బాలయ్య పైసా వసూల్ టీజర్.. ఫ్యాన్స్ కు పండుగ మొదలైనట్టే..!

నందమూరి బాలకృష్ణ హీరోగా డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా పైసా వసూల్. వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీయా శరణ్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు సంబందించిన టీజర్ అదే స్టంపర్ 101గా రిలీజ్ చేశారు. అన్నా  రెండు బాల్కాని టికెట్లు ఇవ్వు అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ ఒక్కటి చాలు సినిమాలో బాలయ్యను పూరి ఎలా చూపించాడో చెప్పడానికి.
స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో బాలయ్య ఫుల్ ఎనర్జీతో కనిపిస్తుండటంతో విశేషం. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో త్వరలో రిలీజ్ చేయనున్నారు. పూరి మార్క్ తో బాలయ్య పైసా వసూల్ పక్క పైసా వసూల్ మూవీగా అనిపిస్తుంది. సెప్టెంబర్ 29న రిలీజ్ ముందు ప్లాన్ చేసినా సెప్టెంబర్ 1కి ప్రీ పోన్ చేస్తున్నారట. శాతకర్ణి సినిమా తర్వాత బాలయ్య చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే ఉండగా ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి సత్తా చాటాలని చూస్తున్నాడు పూరి జగన్నాథ్.

More from my site

Comments

comments