పవన్ కెరియర్లో చెరిగిపోని చిత్రంగా నిలిచిపోతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 25వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘ఇంజనీర్ బాబు’ లేక ‘అజ్ఞాత వాసి’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా బ్యాంకాక్ లో ఒక షెడ్యూల్ ను పూర్తిచేశారు. మరో షెడ్యూల్ ను హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్ చేశారు.

ఈ నెల 20వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించిన తరువాత యూరప్ వెళతారట. డిసెంబర్ నాటికి అన్ని పనులను పూర్తి చేసి, జనవరి10వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. సంఖ్యా పరంగా పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా ప్రత్యేకమైనది కావడంతో, పవన్ కెరియర్లో చెరిగిపోని చిత్రంగా నిలిచిపోవాలని అభిమానులు భావిస్తున్నారు. అలాగే అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కాంక్షిస్తున్నారు.

More from my site

Comments

comments