భరత్ పెళ్లి… పోసానికి మరియు పరుచూరి బ్రదర్స్ కి లింక్..!

రవితేజ తమ్ముడు భరత్ శనివారం రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. భరత్ రవితేజ తమ్ముడన్న విషయమే తప్ప తన భార్య పిల్లల గురించి వివరాలు తెలియదు. అయితే భరత్ పెళ్లి చేసింది మాత్రం పోసాని కృష్ణ మురళి అని అంటున్నారు. భరత్ తో సంబంధం ఉన్న వారి గురించి ఆరా తీయగా పోసాని ఇంటర్వ్యూలో ఆయన భరత్ కు చేసినా సహాయం ప్రస్థావించడం జరిగింది.

తాను మద్రాస్ లో పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ గా ఉన్నప్పుడు భరత్ తన ప్రేయసితో తన దగ్గరకు వచ్చాడని ఆమెను ప్రేమిస్తున్నాని.. పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడట. అందుకోసం భరత్ తన ప్రేమికురాలికి తన రూం ఇచ్చి ఐదు రోజులు బయట ఉన్నాడట పోసాని. ఈ విషయం అర్ధం చేసుకోక రూం కు అమ్మాయిని తెచ్చుకుంటావా అని తనని రూం ఖాళీ చేయించారని అన్నాడు. ఇక ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్ మొత్త తొక్కలేదని అన్నారు పోసాని.

పోసాని మురళి కృష్ణ చెప్పిన దాన్ని బట్టి చూస్తే భరత్ ఆమెను ఎప్పుడో పెళ్లాడాడట కాని వారు తర్వాత విడిపోయారని అంటున్నారు. ఇక ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉంటుందని తెలుస్తుంది. ఏది ఏమైనా భరత్ రోడ్ యాక్సిడెంట్ లో మరణించడం బాధాకరమని చెప్పాలి. మద్యం తాగి డ్రైవ్ చేయడమే ఈ ఘోరానికి అసలు కారణం అని అంటున్నారు.

More from my site

Comments

comments