శివబాలాజీ ఇంటికి బిగ్ బాస్

జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యహరించిన సరికొత్త రియాల్టీ షో బిగ్‌బాస్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. స్టార్ మా లో ఈ బిగ్ బాస్ షో 70 రోజుల పాటు ప్రేక్షకులను అలరించింది. మొత్తం 14 మందితో మొదలైన తొలిసీజన్‌ విజేతగా హీరో శివబాలాజీ నిలిచాడు. అయితే తాజాగా శివబాలాజీ ఇంటికి బిగ్‌బాస్‌ వచ్చాడు. అంతే కాకుండా టాస్క్‌ కూడా ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడు.

వివరాల్లోకి వెళ్తే శివబాలాజీ, రాజీవ్‌ కనకాల ప్రధాన పాత్రల్లో స్నేహమేరా జీవితం అనే చిత్రం తెరకెక్కింది. ఈచిత్రం ప్రమోషన్లలో భాగంగా బిగ్‌బాస్‌ వాయిస్‌ను ఉపయోగించుకున్నారు. ఇందులో భాగంగా ఒక ప్రమోషన్‌ వీడియోని విడుదల చేశారు. అందులో శివబాలాజీ ఇంట్లో కూర్చుని ఉండగా బిగ్‌బాస్‌ వాయిస్‌ వినిపిస్తుంది. బిగ్ బాస్ షో విజేతగా నిలిచినందుకు, స్నేహమేరా జీవితం సినిమా ట్రైలర్‌ 1మిలియన్‌ వ్యూస్‌ దాటినందుకు బిగ్‌బాస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

More from my site

Comments

comments