బిగ్ బాస్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ అసలు లెక్క ఇదే..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ స్టార్ మాలో నిర్వహిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. హిందిలో సూపర్ హిట్ అయిన ఈ షోని తెలుగు తమిళ భాషల్లో కూడా తెచ్చేశారు. ఇక తెలుగులో ఈ షోకి వ్యాఖ్యాతగా ఎన్.టి.ఆర్ అదరగొట్టేస్తున్నాడని చెప్పొచ్చు. ఇప్పటికి తారక్ కనిపించిన మూడు ఎపిసోడ్స్ అదిరిపోయాయని చెప్పొచ్చు.

బిగ్ బాస్ కోసం తారక్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అన్న మీద ఓ పెద్ద డిస్క్షన్సే జరిగాయి. కొందరేమో ఎపిసోడ్ కు 50 లక్షలని మరి కొందరేమో 1 కోటి అని అనేస్తున్నారు. అయితే బిగ్ బాస్ నుండి అందిన సమాచారం ప్రకారం ఈ షోలో ఎన్.టి.ఆర్ ఒక ఎపిసోడ్ కు 35 లక్షల దాకా రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నాడట. అంటే వారం లో వచ్చే రెండు ఎపిసోడ్ కు మొత్తంగా 70 లక్షలన్నమాట.

ఇక 70 రోజులు 10 వారాలు సాగనున్న ఈ షో మొత్తానికి తారక్ 7 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ గా ఎన్.టి.ఆర్ చేసిన బుల్లితెరంగేట్రం తన ఫ్యాన్స్ కు ఎంతో హుశారునిస్తుంది. ఇన్నాళ్లు వెండితెర మీదే కనిపించి అలరించిన తారక రాముడు ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటుతున్నాడు.

More from my site

Comments

comments