తారక్ ఫాన్స్ కి మాంచి కిక్కిచ్చే న్యూస్

పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో ఒకప్పటి హీరోయిన్ అయిన నదియాను తీసుకువచ్చి పవన్‌కళ్యాన్‌కి అత్తను చేశారు త్రివిక్రమ్. నదియాకే కాకుండా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో హీరోయిన్ స్నేహాకి మంచి పాత్ర ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే తరహాలో దర్శకుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్‌తో చేయబోయే చిత్రంలో కూడా మరో ఓల్డ్ హీరోయిన్‌ని తీసుకురాబోతున్నారనే వార్తలు తాజాగా టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.

‘నిన్నేపెళ్లాడతా’ చిత్రంతో అప్పట్లో కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన టబుని ఎన్టీఆర్‌తో చేయబోతున్న చిత్రం కోసం త్రివిక్రమ్ తీసుకువస్తున్నారంట. ‘అత్తారింటికి దారేది’ చిత్రంలోని నదియా చేసిన పాత్ర కంటే కూడా పవర్ ఫుల్ పాత్రని ఈ సినిమాలో ఆమె కోసం డిజైన్ చేశారట త్రివిక్రమ్. త్వరలో ఈ విషయాన్ని అఫీషియల్‌గా చిత్ర యూనిట్ తెలియపరచనుందని తాజాగా వార్తలు మొదలయ్యాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ఈ సినిమాలో టబు నటిస్తే మాత్రం చిత్రీకరణ నుండి ఈ సినిమా సెన్సేషన్ అవ్వడం మాత్రం తథ్యం.

More from my site

Comments

comments