పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థానంలో మరొకరిని నియమించినట్లు ప్రకటించిన చంద్రబాబు

ఓ సినీ నటి తనదైన స్టయిల్లో పొగడ్తలతో ఏకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రినే పడేసింది. ఆమె ఎవరో కాదు, పూనమ్‌ కౌర్‌. తాజాగా ఓ కార్యక్రమంలో చంద్రబాబుతోపాటు వేదికనలంకరించింది పూనమ్‌ కౌర్. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రికి ఛార్మినార్‌ ఫోటోని గిఫ్ట్‌ గా ఇచ్చింది పూనమ్ కౌర్. హైద్రాబాద్‌ని ప్రపంచం పటంలో పెట్టింది చంద్రబాబేనని, అందుకే ఆయనకు చార్మినార్‌ ఫొటోని బహుమతిగా ఇస్తున్నానని చెప్పింది. అంతే, చంద్రబాబులో ఆనందం కట్టలు తెంచుకుంది. పొగడ్తలకి పడిపోనివారెవరుంటారు.  అంతే….ఆమె కలలో కూడా ఊహించనంత పెద్ద బహుమతి ఆమెను వరించింది. ఏకంగా…. ఆంధ్రప్రదేశ్‌లో చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌ ని చేశాడు మన ముఖ్యమంత్రి గారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడికక్కడ వేదిక మీదనే పూనమ్‌కౌర్‌ని, చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటించేశారు. చేనేతను ప్రమోట్‌ చేసేందుకుగాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సలహాదారుగా పూనమ్‌కౌర్‌ని నియమిస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే ఇదివరకే ఆంధ్ర ప్రదేశ్ చేనేతకు తానే బ్రాండ్‌ అంబాసిడర్‌ నని పవన్‌కళ్యాణ్‌ ప్రకటించేసుకున్న సంగతి తెల్సిందే కదా. తెలంగాణా చేనేతకు సమంతా, ఆంధ్ర ప్రదేశ్ కి పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న సంగతి తెలిసిందే కదా ! మరి ఈ నియామకంపై పవర్ స్టార్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

More from my site

Comments

comments