ముస్లింల ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి భారీ తాయిలాలు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్‌ పదవి ముస్లింలకే కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ముస్లింల ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సచివాలయం నుంచి ముస్లిం సోదరుల హజ్‌ యాత్ర బస్సులను ఆయన జెండా ఊపి గురువారం ప్రారంభించారు. హజ్‌ యాత్రకు వెళ్తున్న ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ, కడపలో హజ్‌ హౌస్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు రూ.12 కోట్లు కేటాయించామన్నారు. కర్నూలులో URDU UNIVERSITY ని ఏర్పాటు చేస్తామన్నారు. 20వేల మంది ముస్లిం ఆడబిడ్డల వివాహాల కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.2,844 కోట్లు కేటాయించామన్నారు. హజ్‌ యాత్ర సందర్భంగా రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రార్థనలు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,810 మందికి హజ్‌ యాత్రకు ఎపి నుంచి అవకాశాన్ని కల్పించామన్నారు. గతంలో మక్కా వెళ్ళాలంటే నేరుగా విమానం లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులకు గురికావాల్సి వచ్చేదన్నారు. ఈ సందర్భంగా హజ్‌ గైడ్‌ పుస్తకాన్ని సిఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎం.ఎ షరీఫ్‌, ఏపి హజ్‌ కమిటీ ఛైర్మన్‌ మోమిన్‌ అహ్మద్‌ హుస్సేన్‌, సభ్యులు మస్తాన్‌ షరీఫ్‌, హాజీ హసన్‌, భాషా, మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

More from my site

Comments

comments