ఏంటి చార్మి కి బాలయ్య కోసం నాలుగు కోట్లు ఇచ్చారా ?

అందాల కథానాయికగా తెరపై సందడి చేసిన చార్మీ, ఆ తరువాత అవకాశాలకి దూరమైంది. నటిగా పూర్వ వైభవాన్ని అందుకోవాలనే తాపత్రయం కూడా ఆమెలో ఏమీ కనిపించడం లేదు. అలాంటి చార్మీ .. పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ‘పైసా వసూల్’ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తోంది. ఈ సినిమా మేజర్ షెడ్యూల్ షూటింగ్ పోర్చుగల్ లో జరపగా, దగ్గరే వుంటూ చార్మీ అన్ని పనులు చక్కబెట్టింది.

ఈ సినిమాకిగాను ఆమె అందుకునే పారితోషికం 4 కోట్లు అని అంటున్నారు. హీరోయిన్ గా చేసినప్పుడు అందుకున్న పారితోషికం కన్నా ఇది చాలా ఎక్కువ కావడం విశేషం. మొత్తానికి చార్మీకి బాగానే గిట్టుబాటు అయిందన్న మాట. బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన సరసన శ్రియ – ముస్కాన్ లు నటిస్తున్నారు. 28 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణ చేసిన రియల్ ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

More from my site

Comments

comments