చెర్రీ ఇంట్రడక్షన్ సాంగ్…..షూటింగ్ అక్కడ….ఆ వెరైటీ స్టెప్స్‌తో

రామ్ చరణ్-సుకుమార్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గోదావరి జిల్లాల్లో షూటింగ్‌కి ఎండల పుణ్యమాని అంతరాయం కలగడంతో కాస్త బ్రేక్ ఇచ్చి……ఇప్పుడు హైదరాబాద్ సెట్స్‌లో చేస్తున్నారు. ఇక్కడ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. క్లోజ్ అప్ షాట్స్ అన్నీ సెట్స్‌లోనే తీసుకుని…..ఎక్స్‌టీరియర్ షాట్స్‌కి మాత్రం మళ్ళీ గోదావరి జిల్లాలకే వెళ్ళనున్నారు.

ఆ విషయం పక్కన పెడితే ఇక ఈ సినిమా రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ షూటింగ్‌కి టైం వచ్చేసింది. మిగతా సినిమా అంతా కూడా సుకుమార్ స్టైల్‌లోనే సాగనున్నప్పటికీ ఈ ఇంట్రడక్షన్ సాంగ్‌ని మాత్రం కంప్లీట్‌గా తన ఫ్యాన్స్ కోసమే ఉండేలా సుకుమార్‌ని ఒఫ్పించాడట చరణ్. మామూలుగా అయితే సుకుమార్ సినిమాలలో సాంగ్స్ కూడా కథను బట్టే డ్రైవ్ అవుతాయి కానీ ఈ ఇంట్రడక్షన్ సాంగ్‌కి మినహాయింపు ఇవ్వమని చరణ్ చెప్పాడట. మిగతా సాంగ్స్ అన్నీ కూడా మళ్ళీ సుకుమార్ స్టైల్‌లోనే ఉంటాయి. అయితే ఈ ఇంట్రడక్షన్ సాంగ్ మాత్రం కంప్లీట్‌గా చరణ్ స్టైల్ ఊరమాస్ తీన్ మార్ బీట్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే సాంగ్ అంతా కూడా 20 ఏళ్ళ క్రితం చిరంజీవి సాంగ్స్ ఉండే స్టైల్‌లో పూర్తిగా మాస్ డ్యాన్స్‌కి స్కోప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ మొదటి సాంగ్స్‌లో ఉన్నట్టుగా సాంగ్ ఉంటుందని చెప్తున్నారు. చరణ్‌తో పాటు ఓ హాట్ భామతో కూడా ఈ సాంగ్‌లో డ్యాన్స్ చేయిస్తారట. సినిమా మొత్తంలో హై ఎండ్ కమర్షియల్ పాయింట్ ఇదే ఉంటుందని తెలుస్తోంది. జూన్ ఒకటి తర్వాత గోదావరి తీరంలో ఈ సాంగ్ షూటింగ్ మొదలవ్వనుంది. రామ్ చరణ్ నటించిన చాలా సినిమాల్లో ఇంట్రడక్షన్ సాంగ్స్ సూపర్ హైలైట్స్ అయ్యాయి. ఇప్పుడు ఈ సాంగ్ అంతకుమించి అనే స్థాయిలో ఉంటుందేమో చూడాలి మరి.

More from my site

Comments

comments