బోయపాటికి చిరు పిలుపు.. ఉయ్యాలవాడ ఇవ్వడు కదా..!

ప్రతి డైరక్టర్ ఒక రేంజ్ ఉంటుంది.. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటారు కొందరు దర్శకులు.. కాని తనతో సినిమా తీసే హీరోల రేంజ్ పెంచుతూ ఫ్యాన్స్ ను ఫిదా అయ్యేలా చేస్తాడు దర్శకుడు బోయపాటి శ్రీను. కెరియర్ అటు ఇటుగా ఉన్న హీరోలు అతనితో సినిమా చేస్తే చాలు మళ్లీ సెట్ రైట్ అయ్యే సూపర్ హిట్ అందుకోవడం ఖాయం. లాస్ట్ ఇయర్ సరైనోడుతో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా జయ జానకి నాయకా సినిమా చేస్తున్నాడు.

హీరో కుర్రాడే అయినా అది బోయపాటి సినిమా కాబట్టి కచ్చితంగా బెల్లంకొండ బాబుకి ఈ సినిమా మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఎప్పుడు మాట్లాడినా తానేం మాట్లాడను తన సినిమా మాట్లాడుతుందని చెప్పే బోయపాటికి మెగాస్టార్ నుండి పిలుపు వచ్చిందట. సరైనోడు సక్సెస్ తోనే మెగాస్టార్ కన్నుల్లో పడ్డ బోయపాటి అల్లు అరవింద్ తో టచ్ లో ఉండమని చెప్పారు.

ఇక రీసెంట్ గా మళ్లోసారి మెగాస్టార్ బోయపాటి శ్రీనివాస్ తో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. చిరు 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేస్తున్నారు. ఆ సినిమాకు దర్శకుడిగా సురేందర్ రెడ్డిని సెలెక్ట్ చేయగా ఎందుకో సురేందర్ రెడ్డి కన్నా బోయపాటి అయితే సినిమా ఇంకా బాగా వస్తుందని ఆలోచిస్తున్నారట. ఒకవేళ సురేందర్ రెడ్డి డైరక్షన్ చేసినా కథలో కొన్ని మార్పులకు బోయపాటి సహాయం తీసుకోవాలని చూస్తున్నారట. అదే జరిగి ఉయ్యాలవాడ బోయపాటి చేతుల్లోకి వస్తే కచ్చితంగా ఆ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగినట్టే. రాం చరణ్ నిర్మిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా ఆగష్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు నాడు మొదలవనుందని తెలుస్తుంది.

More from my site

Comments

comments