చిరంజీవి కొంచెం కూడా తగ్గట్లేదు.. చరణ్ అంతకు మించి..

‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రాన్ని సగటు సినిమాగానే ట్రీట్‌ చేసిన మెగా క్యాంప్‌ ఇప్పుడు దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒక సగటు సినిమాని తీసినట్టుగా తక్కువ బడ్జెట్‌లో తీయకుండా, భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌, భారీ బడ్జెట్‌, భారీ సెట్స్‌తో బాహుబలికి ధీటుగా తెరకెక్కించాలని డిసైడ్‌ అయింది. ఇప్పటికే ఈ చిత్రానికి చరణ్‌ నూట యాభై కోట్ల బడ్జెట్‌ కేటాయించాడు.

ఎప్పుడో సెట్స్‌ మీదకి వెళ్లాల్సిన ఈ చిత్రం స్క్రిప్ట్‌ పరంగా రాజీ పడకుండా, యూనివర్సల్‌ అప్పీల్‌ వచ్చే మాదిరిగా తీర్చి దిద్దడానికి కసరత్తు జరుగుతోంది. ఆగస్టు 22న మొదలు కావాల్సిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ నెలాఖరుకి వాయిదా వేసారట. ఫలానా టైమ్‌కి కథ సిద్ధం కావాలి, సెట్స్‌ మీదకి వెళ్లాలి అంటూ చిరంజీవి ఎలాంటి కండిషన్లు, టైమ్‌ లిమిట్లు పెట్టడం లేదట. తాను ఇక హీరోగా నటించే సినిమాలు ఎన్నో వుండవు కనుక తన కెరియర్‌లోను, తెలుగు సినిమా చరిత్రలోను గుర్తుండిపోయే విధంగా దీనిని తీర్చిదిద్దాలని మెగాస్టార్‌ పదే పదే చెబుతున్నారట.

More from my site

Comments

comments