‘C/O సూర్య’ ట్వీట్ రివ్యూ

6:34 AM : చివరకు విలన్ల బారి నుండి తన సోదరిని సందీప్ కిషన్ రక్షించుకున్నాడు.

6:24 AM : చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది. హీరో విలన్ మధ్య హోరాహోరీ ఫైట్ వస్తోంది.

6:14 AM : చిత్ర అసలు కథ రివీల్ అయింది. సందీప్ కిషన్ తన సోదరిని మరియు స్నేహితుడు విక్రాంత్ ని రక్షించే పనిలో పడ్డాడు.

6:04 AM : హీరోకి విలన్ కి మధ్య మైండ్ గేమ్ కి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి. పోలీస్ లు విలన్ గ్యాంగ్ లోని కీలక వ్యక్తిని సందీప్ కిషన్ సాయంతో అరెస్ట్ చేశారు.

5:54 AM : విలన్ ని గుర్తించడానికి సందీప్ కిషన్ ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ‘రుద్రాక్ష’ అనే సాంగ్ వస్తోంది.

5:45 AM : మైండ్ గేమ్ నేపథ్యంలో ఉత్కంఠగా సాగే సన్నివేశంతో ఆసక్తికరంగా ఫస్ట్ హాఫ్ ముగిసింది. ఇప్పుడు ఇంటర్వెల్.

5:38 AM : చిత్ర కథ నెమ్మదిగా వేగం పుంజుకుంది. హీరో మరియు అతడి స్నేహితులపై విలన్ గ్యాంగ్ అటాక్ మొదలైంది.

5:32 AM : కొన్ని అందమైన సన్నివేశాల తరువాత చిత్రంలో మరో పాట ‘మొదలవుతోందా’ వస్తోంది.

5:28 AM : సందీప్ కిషన్ మెహ్రీన్ ప్రేమలో పడ్డాడు. ఆమెని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం కామెడీ సీన్స్ వస్తున్నాయి.

5:20 AM : కమెడియన్ ప్రవీణ్ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. ప్రస్తుతం హాస్యభరితమైన సన్నివేశాలు వస్తున్నాయి.

5:13 AM : స్నేహాన్ని వివరించే కొన్ని సన్నివేశాల తరువాత ‘ఏచచ ఏచచ’ అనే సాంగ్ వస్తోంది. సాంగ్ ని నైట్ మోడ్ లో చిత్రీకరించారు.

5:03 AM : హీరోయిన్ మెహ్రీన్ ఎంట్రీ ఇచ్చింది. మెహ్రీన్ లుక్స్ చాలా బావున్నాయి. ప్రస్తుతం కాలేజీ సన్నివేశాలు వస్తున్నాయి.

4:58 AM : సందీప్ కిషన్ మరో స్నేహితుడిగా తమిళ నటుడు విక్రాంత్ ఎంటర్ అయ్యాడు. విలన్ గ్యాంగ్ కి అతడికి మధ్య ఆసక్తి కరమైన సన్నివేశాలు వస్తున్నాయి.

4:51 AM : కమెడియన్ సత్యతో పాటు మరి కొందరు నటులు సందీప్ కిషన్ స్నేహితులుగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.

4:47 AM : నటుడు హరీష్ ఉత్తమన్ కిరాయి హంతకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి.

4:44 AM : టైటిల్స్ రోల్ అవుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో సదా మంచి కోరకు సాంగ్ ప్లే అవుతోంది.

4:40 AM : చిత్రం వైజాగ్ నగరంలో ప్రారంభం అయింది. సందీప్ కిషన్ సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం భాదాకరమైన సన్నివేశాలు వస్తున్నాయి.

4:35 AM :  చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.

Comments

comments