లేటయినా లేటెస్ట్ ఇండస్ట్రీ రికార్డ్ కొట్టాలంతే- అభిమాని ఆవేదన

యంగ్ టైగర్ NTR హీరోగా బాబి డైరక్షన్ లో వస్తున్న సినిమా జై లవ కుశ. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు అంతేకాదు ఎప్పటికప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నా అంతా హడావిడిగా అవుతుందట.

సెప్టెంబర్ 21న సినిమా రిలీజ్ ఫిక్స్ చేయడం వల్లే ఇన్ని సమస్యలు వస్తున్నాయట. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 10 కల్లా సినిమా పూర్తి చేసి పెట్టాలని బాబి మీద ప్రెజర్ చేస్తున్నారట. ఇక ఇదే సీన్ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ బాబి కాంబినేషన్ లో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విషయంలో జరిగిందని తెలిసిందే.
పవన్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం సినిమా హడావిడిగా పూర్తి చేయడం జరిగింది. ఇక సినిమా ఫలితం కూడా అందరికి తెలిసిందే. ఇక సేమ్ సీన్ జై లవ కుశకు రిపీట్ అవుతుందట. అనుకున్న డేట్ కు తీసుకు రావాలని చకా చకా చుట్టేస్తున్నారట. ఇది కచ్చితంగా సినిమా రిజల్ట్ మీద ప్రభావం చూపిస్తుందని చెప్పొచ్చు.
NTR మూడు పాత్రలతో వస్తున్న జై లవ కుశ హడావిడి చేస్తే అదో రకంగా తయారవుతుంది. మరి బాబికి ఇవ్వాల్సిన ఫ్రీడం ఇచ్చి సినిమా చేయించుకుంటే మంచిది లేదంటే మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఎంత అనుకున్నా ఏమి లాభం ఉండదు

More from my site

Comments

comments