ఎన్టీఆర్ అభిమానులందరూ ఎదురు చూస్తున్న రోజు ఇదే… జై లవకుశ ఆడియో డేట్ ఫిక్స్

తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ఎన్టీఆర్ చేస్తున్న ‘జై లవ కుశ’ కూడా ఒకటి. ‘జనతా గ్యారేజ్ ‘ వంటి హిట్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడం, ఇందులో NTR త్రిపాత్రాభినయం చేస్తుండటం, ఇప్పటికే బయటకొచ్చిన జై, లవ కుమార్ పాత్రల లుక్స్, జై పాత్ర యొక్క టీజర్ బాగుండటంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

దీంతో చిత్ర యూనిట్ ఏమాత్రం ఆలస్యం ఉండకుండా చెప్పిన తేదీ సెప్టెంబర్ 21 కే సినిమాను విడుదలచేయాలని నిర్ణయించుకుని శరవేగంగా పనులు చేస్తున్నారు. అందులో భాగంగానే సెప్టెంబర్ 10 వ తేదీన ఆడియోను రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే లవ కుమార్ పాత్ర టీజర్ ను కూడా ఈ నెల 25 వినాయక చవితి సందర్బంగా రిలీజ్ చేయనున్నారు. మూడవ పాత్ర ‘కుశ’ కు సంబందించిన ఫస్ట్ లుక్, టీజర్ ను కూడా ఈ నెలాఖరునే విడుదలచేస్తామని నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రకటించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

More from my site

Comments

comments