దసరా విజేత ఎవరో తెలిసిపోయింది.

సెప్టెంబర్ 21న విడుదలయిన జై లవకుశ సినిమా ఏ రేంజ్ హిట్ సాధించిందో తెలిసిపోయింది. సెప్టెంబర్ 27న థియేటర్లలో సందడి చేసిన స్పైడర్ ఫలితం కూడా తేలిపోయింది. ఇక మిగిలింది మహానుభావుడు సినిమా ఫలితమే. ఇద్దరు స్టార్ హీరోలతో పోటీపడి మరీ దసరాకు సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు శర్వానంద్.

మహానుభావుడు ఓవర్సీస్‌లో ఓ రోజు ముందుగానే గురువారమే విడుదలయింది. ఈ సినిమా ఫలితం పట్ల ఎన్నారై సినీ ప్రియులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కామెడీ, లవ్‌ట్రాక్, సాంగ్స్.. ఇలా అన్నీ కూడా సినిమాలో చక్కగా కుదిరాయంటున్నారు. హీరోయిన్‌కు ముద్దు పెట్టాలన్నా కూడా అతి శుభ్రం పాటించే వ్యక్తి.. తన ప్రేమను దక్కించుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు. కాలుబయటకు పెట్టాలన్నా సాక్స్ వేసుకుని వెళ్లే వ్యక్తి.. ప్రేయసి కోసం ఆమె ఇంటికి వెళ్లి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది సినిమా కాన్సెప్ట్ అట. సినిమా అంతా ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవకుండా సరదాగా సాగిపోతుందని చెబుతున్నారు. కాకపోతే అక్కడక్కడా మారుతి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన ‘భలేభలే మగాడివోయ్’ని గుర్తుకు తెస్తుందట. భలేభలే మగాడివోయ్ రేంజ్‌లో లేకున్నా ప్రేక్షకులను మాత్రం అలరిస్తుందని ఎన్నారైలు చెబుతున్నారు.
దసరాకి విడుదలైన మూడు సినిమాల్లో జై లవకుశ 132 కోట్ల కలెక్షన్స్ సాధించి ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది. మహానుభావుడు హిట్ అయినా సరే జై లవకుశ 150 కోట్ల క్లబ్ లో చేరుతుంది. స్పైడర్ ఎలాగూ పోటీ నుంచి తప్పుకున్నట్లే.
జై లవకుశ చిత్రంలో తారక్ మూడు పాత్రల్లో నటించిన తీరుకి అందరూ దాసోహమై.. పదేపదే సినిమా చూస్తున్నారు. ఇక సెలబ్రిటీలైతే తారక్‌ని ఆకాశానికెత్తేస్తున్నారు. తారక్ నటనని మనిషి ప్రాణంగా పోలుస్తూ దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు చేసిన కామెంట్, ఆయన శిష్యుడైన రాజమౌళి సైతం.. తారక్ నటనని చూసి తన గుండె గర్వంతో ఉప్పొంగిపోయిందంటూ జై కొట్టాడు. ఇప్పుడు కొత్తగా ఈ జనరేషన్‌లో ఇంతటి అద్భుతమైన నటనా శైలి నీకు మాత్రమే సొంతం అని రామ్ చరణ్ అన్నాడు. కనుక ఈ దసరా విజేత తారక్.

More from my site

Comments

comments