దసరా కు దరువు వేయాల్సిందే …

దసరా రేసును ఎట్టి పరిస్థితుల్లో మిస్సయ్యేది లేదు అంటూ ప్రకటించాడు కళ్యాణ్ రామ్. తన తమ్ముడితో తీస్తున్న ”జై లవ కుశ” సినిమాను పోస్టుపోన్ చేస్తున్నట్లు వస్తున్న రూమర్లను అస్సలు నమ్మొద్దంటూ చెప్పేశాడు. అదంతా బాగానే ఉంది కాని.. ఇప్పుడు NTR సినిమా షూటింగులో బిజీగా ఉండటంతో..  అసలు మనోడి దగ్గర ఉన్న టైమ్ ఈ సినిమాను పూర్తి చేయడానికి సరిపోతుందా అనే సందేహాలు వస్తున్నాయి.

ఇవాళ ఆగస్టు 18. అంటే ”జై లవ కుశ” సినిమా రిలీజవ్వడానికి రమారమి ఇంకా 30 రోజులు ఉంది. అందులో 10 రోజులపాటు జూనియర్ NTR బాస్ కు సమయం కేటాయిస్తాడు కాబట్టి.. మనోడి దగ్గర ఈ సినిమా కోసం కేవలం 20 రోజులే ఉన్నట్లు. అందులోనూ ఓ వారం రోజులు ప్రమోషన్లకు కేటాయించాలి. అంటే కేవలం 13 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ టైములోనే టాకీపార్టు అలాగే పాటల షూటింగ్ కూడా కంప్లీట్ చేయాలి. ఈ మధ్య కాలంలో చాలామంది పెద్ద హీరోల సినిమాలు ఇలా ఆఖరి నిమిషంలో కత్తిమీద సాము తరహాలో పూర్తి చేస్తున్నారులే కాని.. మరి ఎన్టీఆర్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు కాబట్టి.. అసలు ఈ సమయం సరిపోతుందా అనే సందేహం రావడం సహజమే. కాని ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు మాత్రం అస్సలు కంగారుపడకండి అంటున్నారు.

కెఎస్ రవీంద్ర(బాబీ ) డైరక్షన్లో రూపొందుతున్న జై లవ కుశ సినిమాలో NTR సరసన రాశి ఖన్నా మరియు నివేథా థామస్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. సెప్టెంబర్ 21న సినిమా రిలీజవ్వనుంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఫై నిర్మిస్తున్నాం కనుక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి జై లవ కుశ సినిమా అభిమానుల అంచనాలకు తగ్గటుగ్గా ఉంటుందని నిర్మాతగా నేను భరోసా ఇస్తున్నాని కళ్యాణ్ రామ్ అన్నారు .

More from my site

Comments

comments