ఇది కదరా న్యూస్ అంటే… ఎట్టకేలకు పవన్ డేట్స్ పట్టేసిన దిల్ రాజు..!

డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ ప్రారంభించి నిర్మాతగా మారి సూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాదు టాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్స్ లో ఒకరుగా స్థానం సంపాదించుకున్నాడు దిల్ రాజు. ఈమధ్యనే తమ బ్యానర్లో 25వ సినిమాగా అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం తీసి టాక్ ఎలా ఉన్నా మంచి కలక్షన్స్ అందుకుంటున్నాడు. నిర్మాతగా ఎవరు వేయని లెక్కలేసే దిల్ రాజు కాంబినేషన్ సెట్ చేయడంలో కూడా తన బుద్ధి బలం వాడుతుంటాడు. నిర్మాత కేవలం డబ్బులు పెడితే చాలు అన్నట్టు కాకుండా సినిమాకు అన్ని తానై నడిపిస్తాడు. అందుకే దిల్ రాజు సినిమాల్లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది.

ప్రస్తుతం మెగా హీరోలందరితో సినిమాలు చేసిన దిల్ రాజు మెగాస్టార్ తో కూడా సినిమా చేయాలని ఉత్సాహంతో ఉన్నాడు. అంతేకాదు ఎప్పుడో పవర్ స్టార్ తో తన బ్యానర్లో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు రాజు. పవన్ ఓకే అంటే చాలు కాంబినేషన్ సెట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇక రీసెంట్ గా త్రివిక్రం సినిమా షూటింగ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ కు కలిసి మళ్లీ తన సినిమా ప్రస్థాన తెచ్చాడట దిల్ రాజు.

అందుకు పవన్ కూడా పాజిటివ్ గా స్పందిస్తూ కథ సిద్ధం చేసుకురా సినిమా చేసేద్దాం అన్నారట. పవర్ స్టార్ కు సెట్ చేసే కథ కోసం రాజు గారు కథల వేటలో పడ్డారని టాక్. ఎలాగు గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి ఈసారి కచ్చితంగా పవన్ ఛాన్స్ వదులుకోకూడదని ఫిక్స్ అయ్యాడు దిల్ రాజు. మరి అతని బ్యానర్లో పవన్ సినిమాను ఏ దర్శకుడి చేతిలో పెడతాడో చూడాలి.

More from my site

Comments

comments