ఎన్టీఆర్ స్క్రిప్ట్ లోనే కాకుండా డైరెక్షన్ లో కూడా వేలు పెడతాడు…అందుకే ఎన్టీఆర్ తో సినిమా చేయను

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఎవరైనా ఉత్సాహ పడుతుంటారు కానీ దర్శకుడు తేజ మాత్రం నేను ఎన్టీఆర్ తో సినిమా చేయనని అంటున్నాడు . ఎన్టీఆర్ తో ఎందుకు సినిమా చేయకూడదో కూడా చెప్పాడు తేజ . ఎన్టీఆర్ స్క్రిప్ట్ లోనే కాకుండా డైరెక్షన్ లో కూడా వేలు పెడతాడని అందుకే అతడితో నేను సినిమా చేసేది లేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు తేజ . ఇటీవల తేజ దర్శకత్వం వహించిన నేనేరాజు నేనే మంత్రి ఘన విజయం సాధించింది.

నేనే రాజు నేనే మంత్రి విజయోత్సవ వేడుకలలో పలు ఇంటర్వ్యూ లు ఇస్తూ చాలా బిజీ గా ఉన్నాడు తేజ . చాలాకాలం తర్వాత హిట్ సాధించడం తో సంతోషంగా ఉన్నాడు . ఇక నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని మలయాళంలో అలాగే తమిళ్ లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . కొత్తవాళ్లతో సినిమాలు చేసి సక్సెస్ కొట్టిన తేజ ఇకపై కొత్తవాళ్ళ తో చేయనని హాయిగా స్టార్ లతో సినిమాలు చేస్తూ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తానని అంటున్నాడు.

More from my site

Comments

comments