డిజె దువ్వాడ జగన్నాధం ఫస్ట్ డే కలక్షన్స్..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరిష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా దువ్వాడ జగన్నాధం. ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మెగా ఫ్యాన్స్ నుండి మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంటుంది. దాదాపు 1800 ధియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు కలక్షన్స్ కూడా 20 కోట్ల పైనే వసూళు చేసే అవకాశాలున్నయని అంటున్నారు.

స్టైలిష్ స్టార్ డిజె క్యారక్టర్ లో అదరగొట్టేశాడు. ఇక పూజా హెగ్దెని ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా వాడుకున్నారని అంటున్నారు. సరైనోడుతో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ఆ సినిమా మొదటి రోజు 15 కోట్ల దాకా కలెక్ట్ చేశాడు. అయితే డిజెకి మాత్రం ఆ లెక్క పెరిగే అవకాశాలున్నాయి. అన్ని చోట్ల 80 టూ 90 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉండే అవకాశం కనిపిస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ తర్వాత హరిష్ శంకర్ తారక్ తో రామయ్యా వస్తావయ్య సినిమా తీశాడు. ఇక ఆ తర్వాత సాయి ధరం తేజ్ తో సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నాడు. తేజ్ తర్వాత మళ్లీ స్టార్ హీరోతో సినిమా తీసిన హరిష్ శంకర్ ఈ సినిమాతో మళ్లీ తన ప్రతిభ చాటుకున్నాడని అంటున్నారు. మొదటి రోజు కలక్షన్స్ ను బట్టే సినిమా ఏ రేంజ్లో కలక్షన్స్ సాధిస్తుందో తెలుస్తుంది. మొదటి రోజు ఏరియా వైజ్ కలక్షన్స్ కొద్దిసేపట్లో తెలుస్తాయి.

More from my site

Comments

comments