10 నిమిషాల ‘ఆ’ పనికి 10 లక్షలు అడిగిన డిజె హీరోయిన్..!

సౌత్ లో హీరోయిన్స్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే.. ముఖ్యంగా తెలుగులో కాస్త కూస్తొ టాలెంట్ ఉంటే చాలు ఆమెను ఆకాశానికెత్తేస్తారు. క్రేజ్ లో ఉన్న హీరోయిన్స్ కేవలం సినిమాలకే కాదు పబ్లిక్ ఈవెంట్ లకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. అంతకుముందు చేసిన రెండు సినిమాలు అంతగా ఆకట్టులోలేని పూజా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డిజెతో మాత్రం దుమ్ముదులిపేసింది.

హరిష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన దువ్వాడ జగన్నాధంలో పూజా గ్లామర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. సినిమా హిట్ లో అమ్మడి స్కిన్ షో కూడా భాగమైంది. తెలుగులో ఈ క్రేజ్ ను ఊహించని పూజా తన డిమాండ్ ను అంతకంత పెంచేస్తుందట. రీసెంట్ గా ఓ షాప్ ఓపెనింగ్ కోసం పూజా దాదాపు 10 లక్షల దాకా డిమాండ్ చేసిందట.

సాధారణంగా ఫాంలో ఉన్న స్టార్ హీరోయిన్స్ అయితే షాప్ ఓపెనింగ్ లాంటి ఈవెంట్ కు 3 నుండి 5 లక్షలు వసూలు చేస్తారు. కాని 10 నిమిషాల అదే పనికి పూజా మాత్రం 10 లక్షలు అడిగి వారికి షాక్ ఇచ్చిందట. అమ్మడు చెప్పిన రెమ్యునరేషన్ కు చుక్కలు కనిపించడంతో సైలెంట్ గా వెళ్లారట నిర్వాహకులు. అంతేకాదు డిజె తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న పూజా హెగ్దె కోటిన్నర రెమ్యునరేషన్ అందుకుంటుందని టాక్. సో ఈ లెక్కన టాలీవుడ్ లో మరో స్టార్ హీరోయిన్ గా పూజా హెగ్దె అవతరించినట్టే.

More from my site

Comments

comments