ఈ సెంటిమెంట్ ఒక్కటి చాలు డీజే సూపర్ హిట్ అని చెప్పటానికి

తాజాగా ‘డిజె’కు సంబంధించిన మరో పవర్‌ ఫుల్‌ సెంటిమెంట్‌ బయటకు వచ్చింది. ‘బాహుబలి-ది బిగినింగ్‌’ చిత్రం ఊపులో సినిమాల మార్కెట్‌ పెరిగి, ఆ తర్వాత వచ్చిన అతి పెద్ద చిత్రం ‘శ్రీమంతుడు’ నాడు నాన్‌-బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. అలా చూసుకుంటే ‘బాహుబలి-ది బిగినింగ్‌’ కన్నా ‘బాహుబలి-ది కన్‌క్లూజన్‌’ ఇంకా పదింతలు హిట్టు.

దాంతో దీని తర్వాత వస్తున్న అతి పెద్ద చిత్రం ‘డిజె’పై కూడా ఆటోమేటిగ్గా పాజిటివ్‌ బజ్‌ వచ్చి మరోసారి నాన్‌ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిన చిరు ‘ఖైదీ నెంబర్‌ 150’కంటే ‘డిజె’ ఎక్కువకలెక్షన్లు వసూలు చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. కాస్త దమ్మున్న కథకి హరీష్‌ శంకర్‌ స్టైల్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడై పాజిటివ్‌ టాక్‌ వస్తే అది పెద్ద విషయం ఏమీ కాదంటున్నారు.ఇక ఈ చిత్రానికి కేవలం విడుదలకు ముందే దిల్‌రాజుకు 25కోట్ల ప్రాఫిట్‌ వచ్చిందంటున్నారు.

More from my site

Comments

comments