డిజె స్టోరీ లీక్.. సోషల్ మీడియాలో సంచలనం..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరిష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దువ్వాడ జగన్నాధం. జూన్ 23న రిలీజవుతున్న ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికెట్ అందుకుంది. అల్లు అర్జున్ బ్రహ్మాణ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కథ లీక్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. లీక్ అయిన కథ ఇదేనంటూ చక్కర్లు కొడుతుండటం విశేషం.

బ్రహ్మాణ యువకుడిగా జీవనం సాగిస్తున్న హీరో.. ఓ ప్రవైట్ కంపెనీ మీద చేసే యుద్ధమే డిజే కథ అని అంటున్నారు. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ తమ కష్టమర్స్ దగ్గర నుండి డబ్బు వసూలు చేసి వారిని మోసం చేసే ల్యాండ్ స్కాం జరుగుతుందట. ఇక వారిని ఆదుకునేందుకు హీరోయిన్ సహాయంతో హీరో ఎలా ఫైట్ చేశాడన్నది డిజె కథట. చూస్తుంటే రొటీన్ కథగా అనిపిస్తున్నా హరిష్ శంకర్ మార్క్ టేకింగ్ తో కచ్చితంగా సినిమా మెగా అభిమానులను అలరిస్తుందని అంటున్నారు.

బయటకు వచ్చిన కథ అదేనా కాదా అన్నది తెలియదు కాని ఎలాంటి కథ వచ్చినా సరే డిజేతో బన్ని మరో సూపర్ హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ప్రొడక్షన్ లో 25వ సినిమాగా వస్తుంది. గంగోత్రి తర్వాత దిల్ రాజు నిర్మించిన ఆర్యతోనే అల్లు అర్జున్ హీరోగా క్రేజ్ సంపాదించాడు. ఆ తర్వాత సూపర్ హిట్ సినిమా పరుగు కూడా అదే బ్యానర్లో హిట్ అందుకున్నాడు బన్ని. ట్రైలర్, సాంగ్స్ తో అంచనాలను పెంచేసిన డిజె లీక్ అయిన కథ అయినా కాకపోయినా అదిరిపోయే రికార్డులు అందుకుంటుందని మెగా ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. మరి ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలంటే మరో 4 రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది.

More from my site

Comments

comments