నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ‘ఎన్టీఆర్ బయోపిక్‌’ గురించి గత నెల రోజులుగా టాలీవుడ్‌లో వాడి వేడిగా చర్చ జరుగుతున్న సంగతి అందరికీ తెలుసిందే. ఈ బయోపిక్ సినిమా విషయంలోకి వివాదాల దర్శకుడు వర్మ ఎంటరవడంతో, ఈ బయోపిక్ వ్యవహారం యమా రంజుగా తయారైంది. ఇటు వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటుంటే, అటు బాలయ్య కూడా తన తండ్రి బయోపిక్‌ చిత్రానికి సంబంధించిన పనులను వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక వర్మ చేయాలనుకుంటున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకి సంబందించిన సమాచారం ఎప్పటికప్పుడు బయటికొస్తుంది కానీ, బాలయ్య చేయాలనుకుంటున్న బయోపిక్ విషయంలోనే ఎటువంటి విషయాలు బయటికి రావడం లేదు. అయితే తాజాగా ఈ బయోపిక్ గురించి ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. బాలకృష్ణ చేయాలనుకుంటున్న ‘ఎన్టీఆర్ బయోపిక్‌’కి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎమ్.ఎమ్. కీరవాణిని సెలక్ట్ చేసారంట దర్శకుడు తేజ. ఈ వార్తతో నందమూరి అభిమానులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

More from my site

Comments

comments