ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త: త్రివిక్రమ్ కన్నా ముందు మరో సినిమా

టెంపర్ సినిమాకు ముందు విషయం పక్కన పెడితే టెంపర్ సినిమా నుంచి మాత్రం తన కెరీర్‌ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. కథలతో పాటు తన క్యారెక్టర్ సెలక్షన్‌లో కూడా మెచ్యూరిటీ చూపిస్తున్నాడు. జైలవకుశలో కూడా ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్స్‌తో, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్‌తో ఎవ్వరికీ కూడా ప్రాబ్లం అనిపించలేదు. అయితే డైరెక్టర్ బాబీ మాత్రం అప్ టు ది మార్క్ అవుట్ పుట్ ఇవ్వలేకపోయాడు. ఆ విషయం పక్కనపెడితే తన తర్వాత సినిమాను మాత్రం మరింత పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. గ్యాప్ కూడా పెద్ద‌గా తీసుకోవ‌డం లేదు. ఒక సినిమాకు, మరో సినిమాకు సంబంధం లేకుండా వినూత్నమైన క్యారెక్టర్లను ఎంపిక చేసుకుని వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

త్రివిక్ర‌మ్ సినిమా త్వ‌ర‌లో మొద‌ల‌వ్వ‌బోతోంది. ఈలోగా.. ఎన్టీఆర్ మ‌రో సినిమా కూడా చేసే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌. త్రివిక్ర‌మ్-పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాత‌వాసి’ ఈ సంక్రాంతికి విడుద‌ల అవుతుంది. ఆ త‌ర‌వాత‌.. ఎన్టీఆర్ స్క్రిప్టు మొద‌లై, పూర్త‌య్యే స‌రికి మ‌రో మూడు నెల‌లైనా ప‌డుతుంది. ఈలోగా ఖాళీగా ఉండ‌డం ఎందుక‌న్న‌ది ఎన్టీఆర్ ఆలోచ‌న‌. అందుకే… ఈ ఆరు నెల‌ల్లో ఓ సినిమా పూర్తి చేద్దామ‌నుకొంటున్న‌ట్టు టాక్‌. అందుకోసం ఇటీవ‌ల దిల్‌రాజుతో ఎన్టీఆర్ సంప్ర‌దింపులు జ‌రిపాడ‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్ రేపో మాపో.. విదేశాల‌కు వెళ్ల‌నున్నాడు. కుటుంబ స‌భ్యుల‌తో రెండు వారాల పాటు జాలీ ట్రిప్ వేసి తిరిగి వ‌స్తాడు. దిల్‌రాజు బ్యాన‌ర్‌లో,ఓ యువ ద‌ర్శ‌కుడితో ఎన్టీఆర్ సినిమా చేసే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని టాక్‌. అందుకోసం దిల్ రాజు రెడీగానే ఉన్నాడట‌. త‌న ద‌గ్గ‌ర ఓ స్క్రిప్టు కూడా ఉంద‌ని, ఆరు నెల‌ల్లో సినిమా పూర్తి చేస్తానన్న మాట ఇస్తే, దిల్‌రాజు బ్యాన‌ర్‌లో త‌దుప‌రి సినిమా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది.

More from my site

Comments

comments