హీరోలకి రికార్డులు-డిస్ట్రిబ్యూటర్లకి నష్టాలు

దసరాకు విడుదలైన పెద్ద సినిమాలు యుఎస్ బాక్సాఫీస్ వద్ద నిరుత్సాహపరిచిన విషయం తెలిసిందే. “జై లవకుశ” మరియు “స్పైడర్” రెండూ 1.5 మిలియన్ మార్క్ ను అందుకుని, ఆయా హీరోల కెరీర్లలో కొత్త రికార్డులను సాధించిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి వరుసగా మూడు సినిమాలు 1.5 మిలియన్స్ అందుకుని, దక్షిణాదిలో ఈ ఫీట్ ను అందుకున్న మొదటి హీరోగా తన పేరును నమోదు చేసుకోగా, తాజాగా ప్రిన్స్ కూడా మరో రికార్డును కైవసం చేసుకున్నాడు. 1.5 మిలియన్స్ సాధించిన చిత్రాల జాబితాలో “స్పైడర్”తో ప్రిన్స్ మహేష్ బాబు నాలుగుకు పెంచుకొని యుఎస్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తాను చాటుకున్నాడు.

“జై లవకుశ” సినిమా నష్టాలను మిగల్చకపోయినా, లాభాలైతే ఖచ్చితంగా లేవు. యావరేజ్ టాక్ తో ప్రయాణం మొదలుపెట్టి కూడా ‘జై లవకుశ’ సినిమా డిస్ట్రిబ్యూటర్లను నిలబెట్టింది. అయితే స్పైడర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలనే మిగిల్చింది. “స్పైడర్” యుఎస్ డిస్ట్రిబ్యూటర్ కు కంటి మీద కునుకు లేకుండా చేసిందని చెప్పడంలో సందేహం లేదు. మహేష్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా ‘స్పైడర్’ నిలవడం కూడా ఓ రికార్డే. భారీ నష్టాలను మిగిల్చిన స్పైడర్ సినిమా గురించి సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు గొప్పగా చెప్పుకోవడం అసలు ట్విస్ట్. అయితే ఫ్లాప్ టాక్ తో కూడా ‘స్పైడర్’ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసిందని మహేష్ ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే ప్రీమియర్స్ తోనే ‘స్పైడర్’ 1 మిలియన్ అందుకోగా, అక్కడ నుండి 1.5 మిలియన్ కు చేరుకోవడానికి ఏడు రోజుల సమయం తీసుకోవడం చూస్తుంటే… కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

More from my site

Comments

comments