వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డు సాధించిన ఎన్టీఆర్: నాగ్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కడికే ఆ రికార్డు ఉంది, 100 ఏళ్ల ఇండియన్ సినిమా హిస్టరీలో అతి పిన్న వయసులో స్టార్ డంని పీక్స్ లో ఎంజాయ్ చేశాడు ఎన్టీఆర్. ఈ మాటలు అంటుంది ఏ విశ్లేషకులో లేక ఎన్టీఆర్ అభిమానులో కాదు టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన కింగ్ నాగార్జున చెబుతున్న మాటలు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ని మొదలుపెట్టిన తొలి రోజుల్లోనే స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి లాంటి సంచలన ఇండస్ట్రీ రికార్డు విజయాలతో అప్పటి స్టార్ హీరోలైన చిరంజీవి-బాలక్రిష్ణ-నాగార్జున-వెంకటేష్ లకు సరి సాటి ఈ ఘనాపాటి జూనియర్ ఎన్టీఆర్ అని అనిపించుకున్నాడు. ఇలాంటివి సాధ్యం అవ్వాలి అంటే కచ్చితంగా స్టొరీ లపై పట్టు ఉండాలి అది ఎన్టీఆర్ కి చిన్న వయసులోనే వచ్చింది.
తాను తన కొడుకులకు కూడా ఇలాంటిదే ఎప్పుడూ చెబుతూ ఉంటానని అఖిల్ కి కొద్దిగా ఎన్టీఆర్ లాంటి అలవాట్లు ఉన్నాయని చెబుతున్నాడు. అన్నీ సెట్ అయితే ఊపిరిలో మేమిద్దరం నటించాల్సింది కాని అలా జరగలేదు. భవిష్యత్తు లో ఇద్దరికీ సెట్ అయ్యేలా మంచి స్టొరీ వస్తే ఎన్టీఆర్ తో చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే అని ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేశాడు కింగ్ నాగార్జున.

More from my site

Comments

comments