బాలీ వుడ్ లో సల్మాన్ ఖాన్ తమిళ్ లో విజయ్ టాలీ వుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే

ఇప్పుడు TWITTER ఫేస్ బుక్ ల ఆగమనంతో నెటిజన్లు ఎక్కువగా మాటల్లో కంటే బొమ్మలతో మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు యాహూ మెయిల్ ఆర్కూట్ లలో ఎమోట్ ఐకాన్స్ ఉండేవి. వాటికి కొనసాగింపుగా ఇప్పుడు వాట్సాప్ లో ఉన్న ఎమోటైకాన్స్ భలే క్లిక్ అయ్యాయ్. ఈ పోటీని తట్టుకోవడానికి ట్విట్టర్లో ఫేస్ బుక్లో కొత్త కొత్త బొమ్మలతో రకరకాలు ఎమోజీలను దించుతున్నారు.

వీటన్నింటికీ కొసమెరుపు ఏంటంటే.. మొన్న ట్యూబ్ లైట్ సినిమా రిలీజ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ ఏకంగా తన బొమ్మనే ఒక ఎమోజీగా రూపొందించి RELEASE చేయించాడు. అలా చేసినందుకు ట్విట్టర్ వారు కొంత వసూలు చేస్తారు. ఇప్పుడు తమిళ హీరో విజయ్ కూడా మెరిసాల్ (తెలుగులో అదిరింది) సినిమా కోసం సేమ్ అదే తరహాలో చేస్తున్నాడు. దీన్నే ఫాలో అవుతూ.. జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ‘జై లవ కుశ’ సినిమాలోని మూడు క్యారక్టర్లనూ మూడు రకాల ఎమోజీలుగా రిలీజ్ చేయిస్తున్నాడట. దీని కోసం అయ్యే ఖర్చు 50 లక్షలు.

సర్లేండి ఇప్పుడు అభిమానులు నెట్లో చాటింగ్లు డిస్కషన్లు చేస్తున్నప్పుడు ఎలాగో రకరకాల ఎమోజీలు పెడుతూ ఉంటారు. అందుకే ఇప్పుడు అలాంటి అభిమానులకు ఇలాంటి ఎమోజీలు ఇస్తే.. ఆ ప్రచారం రేంజే వేరేగా ఉంటుంది. అలాగే టాలీవుడ్లో కూడా ఇదే మొదటిసారి కాబట్టి.. అందరూ వావ్ అనుకునే ఛాన్సుంది.

More from my site

Comments

comments