రామ్ చరణ్ రంగస్థలం సినిమాకి ఐటెం హీరోయిన్ దొరికింది.

సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా రంగస్థలం. ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ సమంతకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కాగా, ఐటెం సాంగ్ మిగిలిపోయింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య, జ‌గ‌డం, ఆర్య 2. 100% ల‌వ్‌ సినిమాల్లో ప్ర‌త్యేక గీతాలు బాగా పాపుల‌ర్ అయిపోయాయి. అదే తరహాలో రంగస్థలం సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో అదిరిపోయే ఐటెమ్ పాట రూపుదిద్దుకొంటోంది.

ఈ పాటలో రామ్ చరణ్ తో సమానంగా డ్యాన్స్ చేసి అలరించగల అందగత్తె కోసం గత కొన్ని రోజులుగా దర్శకుడు సుకుమార్ వెతుకుతుండగా.. ఇప్పటికి పూజా హెగ్డే రూపంలో మంచి డాన్సర్ దొరికింది. పూజాకి ఇదే తొలి ఐటెమ్ గీతం. ఈ పాట‌లో న‌ర్తించ‌డానికి పూజా త‌న అంగీకారం తెలిపింది. ఇప్ప‌టికే సంత‌కాలు కూడా జ‌రిగిపోయాయ‌ట‌. ఈ పాట కోసం త‌మ‌న్నా, శ్రుతిహాస‌న్, బాలీవుడ్ కరీనా, కత్రినా లాంటి స్టార్ల పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయి. అయితే.. వాళ్లంతా భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేయ‌డంతో పూజాని ఎంచుకొన్నారాణి సమాచారం.

రామ్ చరణ్ కూడా ఈ పాటపై ఎక్కువగా కేర్ తీసుకుంటున్నాడని అంటున్నారు. బన్నీ సినిమాలో నటించిన కొన్ని నెలలకే చెర్రీతో చేసే అవకాశం రావడంతో.. పూజా హెగ్డే తెగ హ్యాపీ అయిపోతోందని టాక్.

More from my site

Comments

comments