జగన్ పాదయాత్ర జరగాలి గతంలో మాదిరే మధ్యలో అరెస్ట్ కావాలి: మంత్రి

వైసీసీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర జరగాలి కానీ….మధ్యలో అరెస్టు కావాలని రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. ఈ రోజు మంత్రి అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ… జగన్ అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించడం కాదు.. రాష్ట్రాన్నే వదిలిపోవాలని ఆయన అన్నారు. అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా స్పీకర్‌కు రాజీనామాలు ఇచ్చామన్నారు.

నా రాజీనామానైనా ఆమోదించాలని స్పీకర్‌ని ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశానని, నా నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చి నేను గెలిస్తే ఆ రాజీనామాల గురించి వైసీపీ అడగదని మంత్రి అన్నారు. కాగా… పదే పదే ఎన్నికలతో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అందుకే రాజీనామాలపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడంలేదని తాను భావిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు.

More from my site

Comments

comments