విడుదలకు ముందే చరిత్ర సృష్టిస్తున్న జై లవ కుశ

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న జై లవకుశ చిత్రానికి విడుదల  కి ముందే 35 కోట్ల లాభాలను తెచ్చిపెడుతోంది . అన్న నందమూరి కళ్యాణ్ రామ్ కు ఇప్పటి వరకు ఎక్కువ లాభాలు వచ్చిన సినిమాలు పెద్దగా లేవు పైగా కొన్ని సినిమాలు అయితే ఏకంగా భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి కూడా . కానీ మొట్ట మొదటి సారిగా టాలీవుడ్ టైగర్ నెంబర్ వన్ హీరో ఎన్టీఆర్ వలన కళ్యాణ్ రామ్ భారీ ఎత్తున లాభాలను పొందుతున్నాడు . బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై లవకుశ చిత్రానికి ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది దాంతో మంచి బిజినెస్ జరిగింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో అలాగే ఓవర్ సీస్ లలో కలిపి 95 కోట్ల వరకు బిజినెస్ అయ్యింది , అయితే సినిమా మేకింగ్ మాత్రం 60 లోపే దాంతో రిలీజ్ కి ముందే 35 కోట్ల లాభాలను తెచ్చిపెడుతోంది జై లవకుశ . భారీ ఎత్తున లాభాలు వస్తుండటం తో కళ్యాణ్ రామ్ అప్పులు కూడా తీరిపోనున్నాయి ఈ సినిమాతో . ఎన్టీఆర్ అన్న కు సినిమా చేయడం ద్వారా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కు న్యాయం చేయడమే కాకుండా అన్నని నష్టాల ఊబి లోంచి బయట పడేస్తున్నాడు కూడా . మొత్తానికి అన్నాదమ్ముల అనుబంధంతో నందమూరి కుటుంబం సంతోషంగా ఉంది.

 

More from my site

Comments

comments