ఫాన్స్ కి పండగ న్యూస్: జై లవ కుశ ఫస్ట్ లుక్ డేట్ ఇదే

ఎన్టీఆర్ హీరోగా – బాబీ డైరెక్షన్ లో ట్రిపుల్ యాక్షన్ లో రాబోతున్న జై లవకుశ సినిమా ఫస్ట్ లుక్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నందమూరి అభిమానులకి ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం అంటే కొత్తగా చెప్పాల్సిన పనేమీ లేదు. ఎన్టీఆర్ ఫాన్స్ ఎదురు చూస్తున్న ఫస్ట్ లుక్, టీజర్ గురించి ఒక డేట్ ఫిక్స్ చేసారు. మే లో ఎన్టీఆర్ బర్త్ డే వస్తోంది.మే ఇరవై న రాబోతున్న ఈ పుట్టిన రోజు గురించి స్పెషల్ గా ప్లాన్ చేస్తూఎన్టీఆర్ ఫస్ట్ లుక్ తో పాటు ఒక టీజర్ కూడా విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజుకు ఫస్ట్ టీజరే రిలీజ్ చేద్దామని అనుకున్నా.. రిలీజ్ ముందు అనుకున్నట్లు ఆగస్టులో కాకుండా సెప్టెంబరుకు వాయిదా పడ్డ నేపథ్యంలో మరీ ఇంత ముందుగా టీజర్ లాంచ్ చేయాల్సిన అవసరం లేదని భావించారు. టీజర్ అంటే మరీ హడావుడి అవుతుందని.. షూటింగ్ షెడ్యూళ్లకు బ్రేక్ పడుతుందని కూడా ఆలోచించి ఫస్ట్ లుక్ పోస్టర్ తో సరిపెట్టాలని డిసైడయ్యారు. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజుకు కచ్చితంగా ఏదో ఒక కానుక ఉంటుందనే అభిమానులు ఇప్పటికే ఓ అంచనాతో ఉన్నారు.

More from my site

Comments

comments