జైలవకుశ ఫస్ట్ లుక్ డేట్ మార్పు…..ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో తెలుసా?

టైం వచ్చేసింది….టెంపర్ సినిమా నుంచీ కూడా ఒక్కో సినిమాలో ఒక్కోలా కనిపిస్తున్న ఎన్టీఆర్ జైలవకుశ ఎలా కనిపించబోతున్నాడు అనే విషయం రివీల్ అయ్యే టైం వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతోంది? ఫస్ట్ లుక్ విషయంలో బాబీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అనే ఫుల్ డిటెయిల్స్ బయటకువచ్చాయి.

ఈ సినిమా టైటిల్ లోగోను చాలా చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశాడు బాబీ. నాటి లవకుశ సినిమాను గుర్తుకు తెస్తూ…..అలాగే సినిమా స్టోరీ ఏంటో చెప్పేస్తూ చాలా క్రియేటివ్‌గా డిజైన్ చేశాడు. ఇప్పుడిక ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కూడా అదే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడట. ముగ్గురు ఎన్టీఆర్‌ల గెటప్స్‌ని చూపించాలని ఫిక్స్ అయ్యాడట. మూడు డిఫరెంట్ గెటప్‌లతో ఉండే ఎన్టీఆర్ స్టిల్‌తో ఫస్ట్ లుక్ ఉంటుందని తెలుస్తోంది. మూడు క్యారెక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయన్న వార్తల నేపథ్యంలో ముగ్గురు పవర్ఫుల్ ఎన్టీఆర్‌లు ఒకే పోస్టర్‌లో కనిపిస్తే ఆ పోస్టర్ ఏ స్థాయి సెన్సేషన్ అవుతుందో చెప్పనవసరం లేదు. అలాగే ఈ సినిమా ఫస్ట్ లుక్ తేదీలో కూడా స్వల్ప మార్పు జరిగింది. ముందుగా అనుకున్నట్టుగా మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా కాకుండా……ఒక రోజు ముందుగా మే 19వ తేదీనే ఈ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేస్తారట. మూడు గెటప్స్‌తో అదే టైంలో మోషన్ పోస్టర్‌ కూడా రిలీజ్ చేస్తారు.

More from my site

Comments

comments