జైలవకుశ ఓవర్సీస్ బిజినెస్…….దిమ్మతిరిగే ధర

జైలవకుశ సినిమా కోసం కళ్యాణ్ రామ్ చెప్తున్న బిజినెస్ రేట్లు డిస్ట్రబ్యూటర్స్‌కి దిమ్మతిరిగేలా చేస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమాకు 85కోట్ల అవుట్ రైట్ డీల్ వచ్చినప్పటికీ కళ్యాణ్ రామ్ మాత్రం సింపుల్‌గా నో చెప్పేశాడు. అప్పుడే ట్రేడ్ వర్గాలు ఆశ్ఛర్యపోయాయి. అసలు కళ్యాణ్ రామ్ కాన్ఫిడెన్స్ ఏంటి? ఎంతకు అమ్మాలనుకుంటున్నాడు అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

ఇక ఇఫ్పుడు తాజాగా ఓవర్సీస్ కోసం కళ్యాణ్ రామ్ చెప్పిన రేట్లు మరీ షాకింగ్‌గా ఉన్నాయి. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్‌కి 14 కోట్లకు రెడీ అని చెప్పాడు కళ్యాణ్ రామ్. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 3 మిలియన్ గ్రాస్ కలెక్షన్స్ సాధించాలి. ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన జనతా గ్యారేజ్‌కి ఓవర్సీస్‌లో వచ్చిన కలెక్షన్స్ 2 మిలియన్ల లోపే. ఇక ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఓవర్సీస్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన నాన్నకు ప్రేమతో మాత్రం 2.2 మిలియన్స్ సాధించింది. ఆ సినిమాలకు సుకుమార్, కొరటాల శివ లాంటి టాప్ రేంజ్ డైరెక్టర్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్టర్ సినిమా తీసిన బాబీ జైలవకుశను డైరెక్ట్ చేస్తున్నాడు. అయినప్పటికీ కళ్యాణ్ రామ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. జైలవకుశ 14 కోట్లకు అమ్ముడుపోతే మాత్రం అది మామూలు రికార్డ్ అవ్వదు. అయితే అదే రేంజ్‌లో కలెక్షన్స్ సాధించే సత్తా జైలవకుశకు ఉందా? అసలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ల నమ్మకం ఏంటి అనే ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు

More from my site

Comments

comments