యూట్యూబ్ లో రికార్డులపై జై దండయాత్ర… తొక్కిపెట్టి నారతీస్తున్న ఎన్టీఆర్

నిన్న సాయంత్రం రిలీజ్ అయిన జై టీజర్ యూట్యూబ్ లో ప్రకంపనాలు సృష్టిస్తూనే ఉంది.. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఈ టీజర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తూనే ఉన్నారు. మొట్టమొదటిసారి విలన్ గా నెగటివ్ పాత్రలో తారక్ నటించడమే కాకుండా ఆ పాత్రకు నత్తి కూడా ఉండటం.. దాన్ని పర్ఫెక్ట్ గా పలికిన విధానం ఫాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. టీజర్ కట్ చేసిన విధానం కూడా సూపర్బ్ గా ఉంది. ఇక ఇంటర్నెట్ లో డిజిటల్ వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. యూట్యూబ్ ఒక్క ఛానల్ లోనే 4 మిలియన్ల వ్యూస్ దాటి సరికొత్త రికార్డులకు శ్రీకారం చుట్టింది.

More from my site

Comments

comments